అంతర్జాతీయం

ఓడిపోతానేమో! దూకుడు తగ్గిన ట్రంప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓర్లాండో, ఆగస్టు 12: అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగడానికి ముందే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చేతులెత్తేస్తున్నారా? గత కొన్ని వారాలుగా ఆయన ప్రచారంలో చోటుచేసుకుంటున్న వివాదాలు, ఎదురవుతున్న సవాళ్ల నేపథ్యంలో ‘అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి అవసరమైన సంఖ్యలో నాకు ఓట్లు రావేమో..!’ అని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకూ ప్రచారం చేసిన రాష్ట్రాలన్నింటిలోనూ ఎంతో హడావిడి చేసిన ట్రంప్ అత్యంత కీలక రాష్టమ్రైన ఫ్లోరిడాకు వచ్చేసరికి కొంత మెత్తబడినట్లు కనిపిస్తోంది. తనకు యూటా రాష్ట్రంలో తీవ్రమైన సవాలు ఎదురయ్యే అవకాశం ఉందని చెప్పడమే కాకుండా, తన వైఖరిని అమెరికన్లు అంగీకరించకపోతే ఓటమి అనివార్యమవుతుందన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. రాజకీయంగా తనను తాను సరిదిద్దుకోలేకపోతున్నానని, ఎన్నికల పరంగా దీనికి భారీ మూల్యానే్న చెల్లించుకోవాల్సి రావచ్చని అన్నారు. అయితే మిగతా రాష్ట్రాల్లో కూడా శక్తివంచన లేకుండానే ఆయన ప్రచారం సాగుతోంది.
ఇటీవలి కాలంలో జరిగిన సర్వేల్లో ట్రంప్‌పై డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీదే పైచేయి కావడం, వీరిద్దరి మధ్య కూడా వ్యత్యాసం పెరిగిపోవడం కూడా ఈ రిపబ్లికన్ నామినీ తాజా అభిప్రాయానికి కారణంగా చెబుతున్నారు. అలాగే తోటి రిపబ్లికనే్ల మద్దతు ఇవ్వకపోవడం కూడా ట్రంప్‌లో నైరాశ్యాన్ని పెంచుతోంది. గత నెల రోజులుగా ట్రంప్ చేసిన ప్రసంగాల తీవ్రతకు, తాజాగా ఆయన మాట్లాడుతున్న ధోరణికి మధ్య ఎంతో వ్యత్యాసం కనిపిస్తోంది.