అంతర్జాతీయం

మాదేశం మీకు నరకమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్, సెప్టెంబర్ 2: ‘పాకిస్తాన్‌కు వెళ్తే నరకానికి వెళ్లినట్లు ఉంటుంద’ని భారత రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను పాకిస్తాన్‌లోని పంజాబ్ అసెంబ్లీ సభ్యులు ఖండించారు. పారికర్ వ్యాఖ్యలపై భారత రాయబారిని పిలిపించి తీవ్ర నిరసన వ్యక్తం చేయాలని వారు పాకిస్తాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంజాబ్ అసెంబ్లీలో అధికార పార్టీ సభ్యుడు రమేశ్ సింగ్ అరోరా గురువారం ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ పారికర్ వ్యాఖ్యలు విచారకరమని అన్నారు. భారత్.. విడిపోయే హక్కుకోసం డిమాండ్ చేస్తున్న కాశ్మీరీలపై అత్యాచారాలకు పాల్పడటమే కాకుండా కాశ్మీర్‌లో హింసను ప్రేరేపిస్తోందంటూ పాకిస్తాన్‌ను నిందిస్తోందని ఆయన విమర్శించారు. భారత్.. పాకిస్తాన్‌కు వ్యితిరేకంగా చేస్తున్న ఈ దుష్ప్రచారానికి అడ్డుకట్ట వేయాలని ఆయన కోరారు. అరోరాతో పాటు ఇతర సభ్యులు పారికర్ వ్యాఖ్యలపై భారత రాయబారిని పిలిపించి తీవ్ర నిరసన వ్యక్తం చేయాలని పాకిస్తాన్ విదేశాంగ శాఖను డిమాండ్ చేశారు. అధికార పార్టీకి చెందిన మరో సభ్యుడు షేక్ అల్లాఉద్దీన్ మాట్లాడుతూ కాశ్మీర్ అంశంపై పంజాబ్ అసెంబ్లీ సభ్యులను ఉద్దేశించి మాట్లాడటానికి భారత్‌కు చెందిన నవలా రచయిత్రి, హక్కుల కార్యకర్త అరుంధతీ రాయ్‌ని పంజాబ్ అసెంబ్లీ ఆహ్వానించాలని సూచించారు. తన ప్రతిపాదనను ఆమోదించాలని ఆయన స్పీకర్‌ను కోరారు. మంత్రి రాజా అష్ఫాక్ సర్వర్ ఈ ప్రతిపాదన పట్ల హర్షం వ్యక్తం చేశారు.
ఈ ప్రతిపాదనపై న్యాయపరమైన, దౌత్యపరమైన కోణాలలో సభలో చర్చ జరిగింది. దీని గురించి విదేశాంగ శాఖను ఆశ్రయించడం జరుగుతుందని, తరువాత అరుంధతీ రాయ్‌ని ఆహ్వానించే విషయంలో తదుపరి చర్య తీసుకోవడం జరుగుతుందని సర్వర్ అన్నారు. అధికార, ప్రతిపక్షాలకు చెందిన అనేక మంది సభ్యులు కాశ్మీర్‌లో హింసపై భారత్‌ను నిందించారు. కాశ్మీరీల స్వయంపాలన హక్కును వారు గట్టిగా సమర్థించారు.