అంతర్జాతీయం

భార్యను అమ్మేస్తా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, సెప్టెంబర్ 13: తను అనారోగ్యంగా ఉన్నప్పుడు ఎలాంటి దయాదాక్షిణ్యాలు కనబరచలేదంటూ యుకెలోని ఓ ప్రబుద్ధుడు ఇ-బెలో తన భార్యను అమ్మకానికి పెట్టాడు. యార్క్‌షైర్‌కు చెందిన సిమన్ గత వారం తన 27ఏళ్ళ భార్య లియాండ్రాను అమ్మకానికి పెడుతున్నట్టు ఆమె ఫొటోను ఇ-బెలో పెట్టాడు. అమెను కొనేందుకు దాదాపు 65వేల 880పౌండ్ల వరకూ బిడ్లు వెళ్లాయి. ఈ ఫొటోలో ‘యూజ్డ్ వైఫ్’అని కూడా పేర్కొన్న సిమన్ తన భార్యను అమ్మేయడానికి కారణాలు చెప్పాడు. అంతే కాదు, ఆమెను కొనడం వల్ల కలిగే లాభ నష్టాల గురించీ వివరించాడు. ఆమె శారీరక నిర్మాణం గురించి, వంటలు చేయడంలో ఉన్న నైపుణ్యం గురించీ తెలిపాడు. ఇన్ని మంచి లక్షణాలున్నా..లియాండ్రాను అమ్మేయాలనుకోవడానికి కారణం ఆమె విధేయురాలైన భార్య కాకపోవడమేననీ వివరించాడు. అంతే కాదు, ఆమె వంట తింటే చాలా సందర్భాల్లో ఆసుపత్రి పాలుకావాల్సిందేనని నిజాయితీగా వివరించాడు. కేవలం రెండు రోజుల్లోనే తన అమ్మకానికి 68వేల పౌండ్ల వరకూ బిడ్లు రావడం తనకు ఆశ్చర్యం కలిగించిందన్నాడు. తనను అమ్మకానికి పెట్టానన్న విషయం తెలియగానే తన భార్య తనను చంపేయాలనుకుందనీ సిమన్ తెలిపాడు.