అంతర్జాతీయం

ఐరాసలో బలూచ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జెనీవా, సెప్టెంబర్ 14: నిన్న మొన్నటి వరకూ కాశ్మీర్ అంశాన్ని ఐరాసలో ప్రస్తావించి భారత్‌ను ఇరకాటంలో పడేసిన పాకిస్తాన్‌కు ఇప్పుడు కథ అడ్డం తిరిగింది. మొట్టమొదటి సారిగా బలూచిస్తాన్ అంశాన్ని ఐరాసలో ప్రస్తావించింది. అక్కడి ప్రజలపై పాకిస్తాన్ సాగిస్తున్న దాడులను ప్రపంచ దేశాల దృష్టికి తెచ్చింది. బలూచిస్తాన్‌లోనే కాకుండా, ఆక్రమిత కాశ్మీర్‌లో కూడా తీవ్రస్థాయిలో మానవహక్కుల ఉల్లంఘనలకు పాకిస్తాన్ పాల్పడుతోందని ఆరోపించింది. ఐరాస మానవ హక్కుల మండలి 33వ సమావేశంలో భారత్ తన వాదనను బలంగా వినిపించింది. ఉగ్రవాదాన్ని అణచివేయడంలో పాకిస్తాన్ ఇప్పటి వరకూ చేసిందేమీ లేదన్న విషయం ప్రపంచ దేశాలకు స్పష్టమైందని, ఈ ఉగ్ర ధోరణి విడనాడాలని అనేక దేశాలు ఇప్పటికే ఎన్నోసార్లు విజ్ఞప్తి కూడా చేశాయని ఐరాసలో భారత రాయబారి, శాశ్వత ప్రతినిధి అజిత్ కుమార్ తెలిపారు.ప్రజాస్వామ్య దేశంగా,్భన్నత్వంలో ఏకత్వ భావన బలంగా ఉన్న సమీకృత సమాజంగా భారత్ ప్రత్యేకతను అన్ని దేశాలూ గుర్తించాయని అన్నారు. కానీ పాకిస్తాన్ మాత్రం దీనికి పూర్తి విరుద్ధ లక్షణాలు కలిగి ఉందని, బలూచిస్తాన్ సహా అనేక చోట్ల మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతోందని అన్నారు. పాకిస్తాన్ చేసిన ప్రకటనకు సమాధానం ఇచ్చేందుకు తనకు ఉండే హక్కును ఉపయోగించుకున్న భారత్ బలూచిస్తాన్‌లోని తన సొంత ప్రజలపైనే మానవ హక్కుల్నే కాలరాస్తోందని అన్నారు. జమ్ము కాశ్మీర్ తమ దేశంలో తిరుగులేని అంతర్భాగమని..ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకూ తావేలేదని ఉద్ఘాటించారు.