అంతర్జాతీయం

సైన్యంలోకి వస్తా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోధి సాంబ, సెప్టెంబర్ 19: ఉగ్రవాద దాడిలో తండ్రిని కోల్పోయిన బాధను దిగమింగుతూ తానూ సైన్యంలోకి దేశానికి సేవచేస్తానని పదేళ్ల వన్ష్ ప్రకటించాడు. వన్ష్ ఎవరో కాదు... యూరి సెక్టార్‌లో ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన రవి పాల్ కుమారుడు. దివంగత హవల్దార్ 23 ఏళ్ల నుంచి డోగ్రా రెజిమెంట్‌లో సేవలదిందస్తున్నారు. బారాముల్లా జిల్లాలోని యూరిలో ఆదివారం నాటి ఉగ్రవాద మూకల దాడుల్లో ఆయన చనిపోయారు. పాల్‌కు భార్య గీతారాణి, వన్ష్ (10), సుధన్‌శేషు (7), 80 ఏళ్ళ తల్లి ఉన్నారు. హవల్దార్ మృతితో సాంబ జిల్లాలోని రామ్‌గ్రాహ్ సెక్టార్‌లోని సర్వా గ్రామం విషాదంలో మునిగిపోయింది. తాను బాగా చదువుకుని డాక్టర్ అయి, సైన్యంలో చేరతానని చిన్నారి వన్ష్ వెల్లడించాడు. తన తండ్రి కలలు నిజం చేస్తానని పేర్కొన్నాడు. రవిపాల్ ఇద్దరు సోదరులూ సైన్యంలోనే పనిచేస్తున్నారు.

ఉగ్రవాదుల దాడిలో మృతిచెందిన సైనికులకు సోమవారం పాట్నాలో శ్రద్ధాంజలి ఘటిస్తున్న బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ తదితరులు