అంతర్జాతీయం

పాక్ ‘ఉగ్ర దేశమే’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, సెప్టెంబర్ 21: భారత్‌పైకి ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్తాన్‌కు ఇదో చెంపపెట్టు. అమెరికా ప్రతినిధుల సభలో ఉభయపక్షాలకు చెందిన ఇద్దరు శక్తివంతమైన సభ్యు లు పాకిస్తాన్‌ను ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశంగా పేర్కొంటూ ఒక బిల్లును ప్రవేశపెట్టారు. ‘నమ్మకద్రోహానికి పాల్పడిన పాకిస్తాన్‌కు ఆర్థిక సాయాన్ని నిలిపివేయడానికి, దాన్ని ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశంగా ప్రకటించడానికి ఇది తగిన సమయం’ అని కాంగ్రెస్ సభ్యుడు, ఉగ్రవాదంపై ఏర్పాటు చేసిన సభా ఉపసంఘం చైర్మన్ టెడ్ పోయి అన్నారు. ఉగ్రవాదంపై ఏర్పాటు చేసిన సభా ఉపసంఘం సభ్యుడు, అధికార డెమొక్రటిక్ పార్టీకి చెందిన డానా రోహ్రబచర్‌తో కలిసి ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీకి చెందిన పోయి ‘పాకిస్తాన్ స్టేట్ స్పాన్సర్ ఆఫ్ టెర్రరిజం డిజిగ్నేషన్ యాక్ట్’ (హెచ్‌ఆర్ 6069)ను ప్రవేశపెట్టారు. ‘పాకిస్తాన్ అవిశ్వసనీయమైన మిత్రపక్షమే కాకుండా ఆ దేశం సంవత్సరాల తరబడి అమెరికా శత్రువులకు సాయం చేస్తూ ప్రోత్సహిస్తున్న దేశం’ అని పోయి పేర్కొన్నారు. ‘ఒసామా బిన్ లాడెన్‌కు ఆశ్రయమివ్వడం మొదలుకొని హక్కాని నెట్‌వర్క్‌తో ఆ దేశానికి ఉన్న సత్సంబంధాల వరకు పాకిస్తాన్ ఉగ్రవాదంపై యుద్ధంలో ఎవరి పక్షం వహిస్తోందో వెల్లడించే తగినన్ని ఆధారాలు ఉన్నాయి. అది అమెరికా పక్షం లేదు’ అని ఆయన ఆరోపించారు. ఈ బిల్లు వల్ల ఒబామా పాలనాయంత్రాంగం ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. పాకిస్తాన్ అంతర్జాతీయ ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చిందా? లేదా? అనే అంశంపై 90 రోజులలోగా అధ్యక్షుడు ఒక నివేదిక ఇవ్వవలసి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ‘తరువాత 30 రోజులకు అమెరికా విదేశాంగ మంత్రి పాకిస్తాన్‌ను ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశంగా పేర్కొంటూనో లేక పాకిస్తాన్‌ను ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశంగా ఎందుకు ప్రకటించకూడదో వివరించే తదనంతర నివేదికను జారీ చేయవలసి ఉంటుంది’ అని పోయి చెప్పారు.
యూరి ఉగ్రవాద దాడి సూత్రధారులను న్యాయస్థానం ముందు నిలబెట్టేందుకు తీసుకునే ప్రతి చర్యను సమర్థిస్తున్నట్టు కాంగ్రెస్ సభ్యుడు పెటె ఓల్సోన్ విడిగా ప్రకటించారు. యూరీలోని భారత సైనిక స్థావరంపై ఉగ్రవాద దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. శాంతిని నెలకొల్పడంలో అమెరికాకు భారత్ పటిష్ఠమైన భాగస్వామి అని, మిత్ర పక్షమని ఆయన పేర్కొన్నారు.
భారత సైన్యానికి ఇటీవలి దశాబ్దాలలో ఇంత పెద్ద దెబ్బ తగిలింది యూరీ సెక్టార్‌లో ఉగ్రవాద దాడి వల్లనేనని ‘సెనేట్ ఇండియా కాకస్’ సహాధ్యక్షుడు, సెనేటర్ జాన్ కోర్నిన్ పేర్కొన్నారు. పాకిస్తాన్ గత 30 ఏళ్లుగా తన వ్యూహాత్మక విధానంలో భాగంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని, ప్రస్తుతం అది ప్రపంచ ఉగ్రవాదానికి కేంద్రంగా మారిందని ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బిజెపి (ఒఎఫ్‌బిజెపి)- అమెరికా శాఖ పేర్కొంది.

ఐరాస జనరల్ అసెంబ్లీ 71వ సమావేశం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా,
సెక్రటరీ జనరల్ యుఎన్ సెక్రటరీ జనరల్ బాన్‌కి మూన్