అంతర్జాతీయం

‘ముఖాముఖి’ పోరులో హిల్లరీదే పైచేయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికా అధ్యక్ష ఎన్నికల తొలి ముఖాముఖిలో డెమొక్రటిక్ పార్టీ నామినీ హిల్లరీ హిట్ కొట్టింది. తొట్టతొలి డిబేట్‌లో రిపబ్లికన్ అభ్యర్థిని లక్షలాదిమంది సమక్షంలో చిత్తుచేసింది. నిన్న మొన్నటి వరకూ ఎవరిదారిలో వారు ప్రచారం చేసుకుంటూ వచ్చిన వీరిద్దరూ ఎదురుబదురుగా అనేక జాతీయ అంశాలపై చర్చించారు. ట్రంప్ తనదైన శైలిలో వ్యక్తిగత దాడులకు దిగినా హిల్లరీ
గట్టిగానే తిప్పికొట్టారు. తన స్టామినా గురించి ప్రస్తావించిన ట్రంప్‌కు తన సత్తా చూపించారు.
‘నా స్టామినానా నువ్వు ప్రశ్నించేది..’ అంటూ విరుచుకు పడ్డారు. 112 దేశాల్లో తిరిగా.. శాంతి ఒప్పందాలు, కాల్పుల విరమణ ఒప్పందాల్ని కుదిర్చా. 11గంటల పాటు ఏకబిగిన కాంగ్రెస్ కమిటీ ముందు నిలబడ్డా.. ఇవన్నీ చేసిన తర్వాత స్టామినా గురించి
మాట్లాడు’ అంటూ ట్రంప్‌కు నివ్వెరపోయే షాక్ ఇచ్చారు.
.......................
హెంప్‌స్టెడ్ (అమెరికా), సెప్టెంబర్ 27: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తలపడుతున్న ఇద్దరు అభ్యర్థుల తొలి ముఖాముఖిలో డెమొక్రాట్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై పైచేయి సాధించారు. కొద్ది మాసాలుగా అమెరికా అంతటా వేర్వేరు వేదికలపై విడివిడిగా ప్రచారం చేసుకున్న హిల్లరీ, ట్రంప్ మూడు ముఖాముఖి చర్చల్లో భాగంగా తొలి ముఖాముఖి మంగళవారం జరిగింది. హాఫ్‌స్ట్రా విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరిగింది. దాదాపు 90 నిమిషాల పాటు ఆరోపణలు, ప్రత్యారోపణలతో సాగిన ఈ ముఖాముఖిని టెలివిజన్ల ద్వారా దాదాపు పదికోట్ల మంది అమెరికన్లు వీక్షించినట్లు అంచనా. నవంబర్ 8న జరగబోయే ఎన్నికల్లో ఎవరిని ఎన్నుకోవాలో తెలియకుండా ఉన్న అమెరికన్లకు నిర్ణయం తీసుకోవటానికి మూడు ముఖాముఖి చర్చలు నిర్వహించటం సంప్రదాయం. అందులో భాగంగానే తొలి చర్చ మంగళవారం జరిగింది. దాదాపు 62శాతం మంది ఓటర్లు హిల్లరీ క్లింటన్‌ను అనుకూలంగా స్పందించారని, కేవలం 27శాతం మంది మాత్రమే ట్రంప్ పట్ల సానుకూలత వ్యక్తం చేశారని సిఎన్‌ఎన్/ఓఆర్‌సి పోల్ ప్రకటించింది. ఇద్దరి మధ్య గంటన్నరపాటు జరిగిన చర్చ మొదట్లో సానుకూలంగా ప్రారంభమైనప్పటికీ, తరువాత వ్యక్తిగత ఆరోపణలకు మళ్లింది. ఇద్దరి మధ్యా వాగ్యుద్ధమే జరిగింది. హిల్లరీ న్యుమోనియాతో బాధ పడుతున్నారని, అమెరికా లాంటి దేశానికి అధ్యక్ష పదవిని అధిష్ఠించే శక్తి సామర్థ్యాలు ఎంతమాత్రం హిల్లరీకి లేవని ట్రంప్ ఆరోపించారు. హిల్లరీ నవ్వుతూ మాట్లాడుతూ ‘మంచిది. ఆయనను 112 దేశాలు తిరిగి, శాంతి ఒప్పందాల చర్చలు, కాల్పుల విరమణ ఒప్పందాలు వంటివాటిలో కీలకపాత్ర పోషించటం, కనీసం 11గంటలపాటు కాంగ్రెస్ కమిటీ ముందు నిలవగలిగి ఉన్నప్పుడు నా శక్తిసామర్థ్యాల గురించి ట్రంప్ ప్రస్తావించాలి’’ అని జవాబిచ్చారు. అంతేకాదు, ట్రంప్ దుందుడుకుతనాన్ని ఎండగట్టారు. మహిళల పట్ల, జాతుల పట్ల ఆయనకున్న వ్యతిరేక భావాన్ని, ఆయన తన ప్రచార సభల్లో చేసిన వ్యాఖ్యలతో సహా ప్రస్తావించారు. ట్రంప్ మహిళాద్వేషి అని కూడా ఆయన ఆరోపించారు. అతి పెద్ద రియల్టర్ అయిన ట్రంప్ తన పన్ను చెల్లింపుల వివరాలు ఎందుకు వెల్లడించలేదని ప్రశ్నించారు. దానికి ట్రంప్ జవాబిస్తూ విదేశాంగ మంత్రిగా ఉన్న కాలంలో హిల్లరీ డిలిట్ చేసిన 33వేల ఈమెయిల్స్‌ను బయటపెట్టాలని, ఆమె వెల్లడించిన మరుక్షణం తానూ పన్ను చెల్లింపుల వివరాలను బహిర్గత పరుస్తానన్నారు. సమావేశం తరువాత ట్రంప్ మాట్లాడుతూ నిర్వాహకులు తనకు సరిగ్గా పనిచేయని మైక్‌ను ఇచ్చారని, దానివల్లే తన వాదన సరిగ్గా ప్రజెంట్ కాలేదని అన్నారు.