అంతర్జాతీయం

ఉరీ దాడి భారత్ కల్పించిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, సెప్టెంబర్ 27: పాకిస్తాన్ నేతలు భారత్ వ్యతిరేక ప్రేలాపనలు మానలేదు. వాళ్ల మాటలు ఏ స్థాయికి వెళ్లాయంటే ఉరీలోని ఆర్మీ క్యాంపులో మన జవాన్లపై మనమే దాడి చేయించి చంపుకున్నామనేంతగా వెళ్లింది. ఉరీ ఆర్మీ క్యాంపులో 18మంది జవాన్లను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాద దాడి ఘటన భారత్ తానుగా సృష్టించిదేనని ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మంగళవారం అన్నారు. ఉరీ దాడి వెనుక పాకిస్తాన్ ప్రమేయం ఉన్నట్లు ఎలాంటి సాక్ష్యాలు లేవని ఆయన అన్నారు. అంతే కాదు, ఈ దాడి భారత ప్రభుత్వమే చేయించిందనటానికి తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నట్లు కూడా ఆయన ప్రకటించారు.
‘‘కాశ్మీర్ సమస్య పరిష్కారంపై పాకిస్తాన్‌కు ఉన్నంత శ్రద్ధ భారత్‌కు లేదని ఈ ఘటనతో ప్రపంచానికంతటికీ తెలిసింది’ అని ఆయన అన్నారు. భారత్ వాదనకు చైనాతోసహా ఏ దేశం నుంచీ మద్దతు లభించలేదన్నారు. అమెరికా కాంగ్రెస్‌లో పాక్‌ను ఉగ్రవాదంగా ప్రకటించాలన్న బిల్లు ప్రవేశపెట్టడంపై వ్యాఖ్యానిస్తూ ప్రతి దేశంలోనూ పాక్ వ్యతిరేక శక్తులు పనిచేస్తున్నాయని ఖవాజా అన్నారు. మనకు వ్యతిరేకంగా అయిదు పది గొంతులు మాట్లాడినంత మాత్రాన పాకిస్తాన్‌ను ఉగ్రవాద దేశంగా పరిగణించటానికి సాక్ష్యాలు కాజాలవని ఆయన స్పష్టం చేశారు.