అంతర్జాతీయం

షార్‌లో ప్రారంభమైన అంతరిక్ష వారోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, అక్టోబర్ 4: నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్)లో మంగళవారం అంతరిక్ష వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని ఎంఆర్ కురుప్ ఆడిటోరియంలో విక్రసింహపురి విశ్వవిద్యాలయ ఉప కులపతి ప్రొఫెసర్ వి.వీరయ్య, షార్ కంట్రోలర్ జెవి.రాజారెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్ధేశించి వైస్ చాన్సలర్ వీరయ్య మాట్లాడుతూ భూమిలో ఉండే జల, ఖనిజ నిక్షేపాల ఉనికిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ తక్కువ స్థాయిలో వినిమయం చేసుకొంటూ భావి తరాలకు అవి అంతరించిపోకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కంట్రోలర్ రాజారెడ్డి మాట్లాడుతూ అంతరిక్షం నుండి చూస్తే భూమి పూర్తిగా కన్పిస్తుందని భూమికి, ఉపగ్రహానికి మధ్య సాపేక్ష వేగం శూన్యమైన భూస్థిర కక్ష్య గురించి విద్యార్థులకు అర్ధమయ్యేలా వివరించారు. ఈ వారోత్సవాలు ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా 14సెంటర్లలో నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాకెట్ అనుసంధాన ఉప సంచాలకులు ఆర్.వెంకట్రామన్ అంతరిక్ష వారోత్సవాల విశిష్టతను గురించి క్షుణ్ణంగా వివరించారు. ఆర్‌హెచ్-200 ప్రయోగాన్ని ప్రయోగాత్మకంగా జరిపి విద్యార్థులు తిలకించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆహ్వానం మేరకు విచ్చేసిన విద్యార్థులను షార్‌లో ఉన్న స్పేస్ మ్యూజియం, తదితర ముఖ్య విభాగాలను సందర్శించే అవకాశం కల్పించి వారికి రాకెట్ ప్రయోగాలు, ఉపగ్రహాల పనితీరు వివరించారు.