అంతర్జాతీయం

అమెరికా దివాలా తీసింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, అక్టోబర్ 4: ఇరవై లక్షల కోట్ల డాలర్ల రుణాలు, వంద లక్షల కోట్ల డాలర్లకు పైబడిన నిధులు లేని అప్పులు, ఏడాదికి దాదాపు 800 లక్షల కోట్ల డాలర్ల దాకా ఉన్న భారీగా పెరిగిపోయిన వాణిజ్య లోటు కలిగి ఉన్న అమెరికా ఆర్థిక వ్యవస్థ దివాలా తీసిందని, ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చెప్పుకునే అమెరికా ఇక ఎంతమాత్రం భారీ వేతనాల ఉద్యోగాలను సృష్టించలేదని అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి అయిన డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అమెరికాకు 20 లక్షల కోట్ల డాలర్ల అప్పులున్నాయనని, వార్షిక లోట్లతో అదుపు తప్పిన బడ్జెట్ మనదని ఆయన అన్నారు. ఇవి చాలవన్నట్లు మన పాలకుల అమర్థత కారణంగా మన వాణిజ్య లోటు ప్రతి ఏటా పెరిగిపోతూ ఇప్పుడు 800 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుందని ట్రంప్ అన్నారు. తుప్పుపట్టిపోతున్న వౌలిక సదుపాయాలు, దిగజారిపోతున్న విద్యాసంస్థలు, పెరిగిపోతున్న నేరాలు, క్షీణిస్తున్న సైనిక వ్యవస్థ.. తెరిచి ఉన్న సరిహద్దులు, ఫుల్‌టైమ్ అధిక వేతన ఉద్యోగాలను సృష్టించలేని ఆర్థిక వ్యవస్థ.. వీటన్నిటికి తోడు ప్రతి నెలా జరుగుతున్న జాతి ఘర్షణలు ఇవన్నీ చూస్తే అమెరికా పనయిపోయిందనిపోతోందని కొలరాడోలో జరిగిన ఓ ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ ట్రంప్ అన్నారు. ‘మనకు అప్పగించిన అమెరికా ఇది కాదు, మన పిల్లలకు, మనవాళ్లకు ఇవ్వాలనుకుంటున్న అమెరికా ఇది కాదు’ అని ఆయన అన్నారు. తాను చెప్తున్న మాట ప్రతి అమెరికనూ అనుకుంటున్నదేనని, ఎందుకంటే మన దేశం తప్పుడు మార్గంలో వెళ్తోందని అమెరికన్లలో 70 శాతం మంది నమ్ముతున్నారని కూడా ఆయన అన్నారు. అమెరికన్లు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కోల్పోతుంటే తన ప్రత్యర్థి అయిన హిల్లరీ క్లింటన్, ఆమె భర్త మాత్రం కోట్ల డాలర్లు మూటగట్టుకున్నారని ఆయన ఆరోపించారు. మరో నాలుగేళ్లు బరాక్ ఒబామా, హిల్లరీ క్లింటన్‌లు అధికారంలో ఉంటే పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని ట్రంప్ ఆరోపించారు.

కొలరాడోలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ట్రంప్