అంతర్జాతీయం

హరికేన్ బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్లోరిడా, అక్టోబర్ 7: అమెరికాలోని ఫ్లోరిడాలో మాథ్యూ హరికేన్ బీభత్సం సృష్టిస్తోంది. హైతీ దీవుల్లో భారీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. ఇప్పటి వరకు 842మంది మరణించినట్లు అధికారికంగా అందుతున్న సమాచారం. వేల కొద్దీ జనం ఈ తుఫాను దెబ్బకు నిరాశ్రయులయ్యారు.
అమెరికా అట్లాంటిక్ తీరం మాథ్యూ తుఫాను ధాటికి అల్లల్లాడిపోతోంది. దాదాపు దశాబ్దం తరువాత అమెరికాను వణికిస్తున్న అతి పెద్ద హరికేన్‌గా చెప్తున్నారు. ఫ్లోరిడా నగరం గత వందేళ్లలో ఇంత తుపాను విధ్వంసాన్ని ఎన్నడూ చూడలేదని అమెరికా అధికారులు తెలిపారు. ఉత్తర కరోలినా, దక్షిణ కరోలినా, జార్జియా, హైతి లాంటి నగరాలన్నీ తుపాను తాకిడికి దారుణంగా దెబ్బ తిన్నాయి. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష జరిపారు. ప్రజలెవరూ బయటకు రావద్దని హెచ్చరించారు.
ఫ్లోరిడాలో భారీగా ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవించినందున ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. తుపాను తీవ్రత ఇంకా తగ్గలేదన్నారు.
సుమారు 61500 మందిని పునరావాస శిబిరాలకు తరలించారు. గత మంగళవారం గంటకు 145మైళ్ల వేగంతో గాలులు వీచాయి. శుక్రవారం గంటకు 120 మైళ్ల వేగంతో గాలులు వీచాయని అధికారులు తెలిపారు.