అంతర్జాతీయం

ట్రంప్‌కు చావో రేవో..!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షికాగో, అక్టోబర్ 9: తప్పుల మీద తప్పులు చేస్తూ సొంత కూతుర్ని కూడా వదలకుండా మహిళలపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు ఇక చావోరేవో లాంటి అగ్ని పరీక్ష ఎదురుకాబోతోంది. అమెరికా రాజకీయ చరిత్రలో అభ్యర్థుల భవితవ్యానికి సంబంధించి అత్యంత కీలకంగా భావిస్తున్న రెండో బిగ్ డిబేట్‌కు రంగం సిద్ధమైంది. మొదటి డిబేట్‌లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌దే పైచేయి అయిన నేపథ్యంలో సెయింట్ లూయిస్‌లో జరుగనున్న రెండో డిబేట్‌లో ట్రంప్ ఎంత మేర నెగ్గుకొస్తారన్నది అనుమానంగానే కనిపిస్తోంది. అమెరికా కాలమానం ప్రకారం మరో తొంభై నిముషాల్లోనే ట్రంప్ జాతకం తేలిపోతుందంటూ సిఎన్‌ఎన్ చానల్ చాలా ముందుగానే వ్యాఖ్యానించింది. గత మూడు రోజులుగా ట్రంప్ నోరుజారడం అన్నది పరాకాష్టకు చేరుకుంది. తనకు పోటీగా ఓ మహిళే నిలబడినప్పటికీ మొత్తం మహిళా ప్రపంచానే్న అవహేళన చేసే విధంగా ఆయన వ్యాఖ్యల వీడియోలు ఓ పరంపరగా వెలుగులోకి వస్తున్నాయి. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ నేతలే కాదు చివరికి ఉపాధ్యక్ష పదవికి పోటీ పడుతున్న మైక్ పెన్స్ సైతం ట్రంప్ విపరీత ధోరణిని తట్టుకోలేక పోతున్నారు. ఇప్పటికిప్పుడు ట్రంప్‌ను మార్చి మరో అభ్యర్థిని నిలబెట్టే అవకాశం ఉందా అన్న అంశాన్ని సైతం పార్టీ నేతలు పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది.కానీ ట్రంప్ మాత్రం పోటీ నుంచి వైదొలగేది లేదంటూ బల్లగుద్ది మరీ చెబుతున్నారు. రెండో డిబేట్‌లో హిల్లరీని వదిలేది లేదన్న ట్రంప్ వ్యాఖ్యల దృష్ట్యా దీనిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటి వరకూ జరిగిన దానికి ట్రంప్ క్షమాపణ చెప్పినా పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. అలాగే ట్రంప్ నాయకత్వాన్ని నమ్మి ఆయనకు మద్దతుగా నిలిచిన ఇండో అమెరికన్లు సైతం ఇప్పుడు హిల్లరీ దారి పడుతున్నారు. సాధారణంగా డెమొక్రాట్ పార్టీ వైపే మొగ్గు చూపే ఇండో అమెరికన్లు ఉగ్రవాదం, పాకిస్తాన్‌పై ట్రంప్ మాటలు నమ్మి ఆయనకు వంత పాడారు. ఇప్పుడు పరిస్థితి తలకిందులు కావడంతో హిల్లరీకే తమ మద్దతని ప్రకటించారు.
మహిళలను కించపరిచే వ్యాఖ్యలతో తన అసలు రంగును బయట పెట్టుకున్న ట్రంప్ తాజా వీడియో మరింత కలకలం రేపింది. తన కుమార్తె ఇవాంక గురించి ఏ తండ్రీ చేయని వ్యాఖ్యలు చేశారు. ఇవాంకకు అందమైన శారీరక సౌష్ఠవం ఉందని, మంచి ఆకర్షణ ఉందనే కాకుండా ఇతరత్రా కూడా నీచమైన పదజాలాన్ని ఉపయోగించారు. అలాగే 35 ఏళ్లు దాటిన ఏ మహిళతోనూ తాను సంబంధాలు పెట్టుకోనని, యువతులతోనే డేటింగ్ చేస్తాననీ చెప్పాడు.
మహిళల పట్ల ట్రంప్ చేస్తున్న అవమానకర, వివావాస్పద వ్యాఖ్యలపై ఆయన భార్య మెలానియా నిప్పులు చెరిగారు. ట్రంప్ ఇలాంటి వాడని అనుకోలేదని కూడా వ్యాఖ్యానించారు. అయితే జరిగిన దానికి క్షమాపణ చెప్పారు కాబట్టి అమెరికా ప్రజలు ఆయన్ని క్షమించాలని భార్యగా అభ్యర్థించారు. స్ర్తిల పట్ల ఆయన మాటల్ని తానెంత మాత్రం ఆమోదించడం లేదని, అవి దిగ్భ్రాంతికరమైనవేనని ఒప్పుకున్నారు. ట్రంప్ తాజా వీడియోలు గందరగోళాన్ని సృష్టించి ఆయన ఆభ్యర్థిత్వానే్న ప్రశ్నార్థకంగా మారుస్తున్న నేపథ్యంలో మెలానియా ఈ బహిరంగ ప్రకటన చేశారు.