అంతర్జాతీయం

ముస్లింల మద్దతు హిల్లరీకే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్: ముస్లింలు అమెరికాలోకి ప్రవేశించడంపై నిషేధం విధించాలని ట్రంప్ పిలుపునిచ్చిన నేపథ్యంలో వచ్చే నవంబర్‌లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో దేశంలోని ప్రతి పదిమంది ముస్లింలలో ఏడుగురు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కే ఓటు వేయనున్నారు. నిజానికి అమెరికాలోని ముస్లింలలో నాలుగు శాతం మంది మాత్రమే ట్రంప్‌కు మద్దతు ఇస్తున్నట్లు కౌన్సిల్ ఆన్ అమెరికన్-ఇస్లామిక్ రిలేషన్స్(సిఏఐఆర్) నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడయింది. దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వే ఫలితాలను ఆ సంస్థ గురువారం విడుదల చేసింది. సర్వేలో పాల్గొన్న వారిలో 72 శాతం మంది తాము హిల్లరీ క్లింటన్‌కే ఓటు వేస్తామని చెప్పడం గమనార్హం. 2016 జనాభా లెక్కల ప్రకారం అమెరికాలో దాదాపు 33 లక్షల మంది ముస్లింలు ఉన్నారు. ఓటరుగా నమోదు చేసుకున్న ముస్లింలలో 86 శాతం మంది తాము హిల్లరీకి ఓటు వేస్తామని చెప్పగా, 12 శాతం మంది తాము ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పడం గమనార్హం.