అంతర్జాతీయం

ఒమర్‌కు చేదు అనుభవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, అక్టోబర్ 17: అమెరికా పర్యటనకు వచ్చిన కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను న్యూయార్క్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు రెండుసార్లు తనిఖీ చేశారు. దీంతో రెండు గంటలపాటు ఆయన విమానాశ్రయంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ సంఘటనపై ఒమర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ట్వీట్ చేశారు. మొదటిసారి తనిఖీలు చేసిన ఇమ్మిగ్రేషన్ అధికారులు మరోసారి తనిఖీలు చేయడంపై ఒమర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. న్యూయార్క్ యూనివర్శిటీలో ఓ కార్యక్రమంలో ప్రసంగించాల్సి ఉండగా ఇమ్మిగ్రేషన్ అధికారుల తీరువల్ల రెండు గంటల విలువైన సమయం ఎయిర్‌పోర్టులోనే గడపాల్సి వచ్చిందని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఆవేదన వ్యక్తం చేశారు. నూయార్క్ యూనివర్శిటీ స్టూటెండ్ ఆర్గనైజేషన్ ఆహ్వానం మేరకు కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఇక్కడకు వచ్చారు. జాన్ ఎఫ్ కెనడీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ సంఘటన జరిగిందని అబ్దుల్లా తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ‘ఇమ్మిగ్రేషన్ తనిఖీలు సాధారణమే. అయితే రెండుసార్లు చేయడం వల్ల నా రెండు గంటల సమయం వృధా అయిపోయింది’ అని రెండో ట్విట్టర్‌లో ఒమర్ తెలిపారు. అమెరికా వచ్చిన ప్రతిసారీ తనకు ఇలాంటి చేదు అనుభవం ఎదురవుతోందని విమర్శించారు. అమెరికా భద్రతాధికారులంటే తనకు ఎంతో గౌరవరం ఉందని, అలాగని ఒకసారి తనిఖీలు అయ్యాక మళ్లీ చేయడమేమిటని ఒమర్ ప్రశ్నించారు. ఈ నెల 21న న్యూయార్క్ యూనివర్శిటీలో జరిగే ఓ కార్యక్రమంలో ఒమర్ అబ్దుల్లా ప్రసంగించనున్నారు. పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్, బిజెపి నేత సుబ్రహ్మణ్యస్వామి కూడా ఈ కార్యక్రమంలో ప్రసంగించే అవకాశం ఉంది.