అంతర్జాతీయం

మోసుల్ స్వాధీనానికి కదిలిన ఇరాక్ సైన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగ్దాద్, అక్టోబర్ 17: ఇస్లామిక్ తీవ్రవాదుల చేతుల్లో ఉన్న అత్యంత కీలక పట్టణం మోసుల్‌ను తిరిగి స్వాధీనం చేసుకునే దిశగా ఇరాక్ సైన్యం రంగంలోకి దిగింది. ప్రపంచానికే పెనుముప్పుగా మారిన ఐసిస్ జిహాదీ గ్రూపును అణచివేయటానికి నిర్ణయాత్మక యుద్ధమవుతుందని దీన్ని భావిస్తున్నారు. మోసుల్‌లో దాదాపు పదిహేను లక్షల జనాభా ఉందని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ఇరాక్ సైన్యం దాడులకు పూనుకుంటే, జిహాదీలు వీరిని మానవ కవచాలుగా వాడుకునే ప్రమాదం ఉందని ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది. అయితే మోసుల్‌ను స్వాధీనం చేసుకుంటే ఐసిస్ ఆయువుపట్టును దెబ్బతీసినట్టే అవుతుందని ఇరాక్ ప్రధానమంత్రి హైదర్ అల్ అబాదీ అన్నారు. ‘‘ ఉగ్రవాద హింస నుంచి మీకు విముక్తి కల్పించేందుకు అనేక రకాల సైనిక ఆపరేషన్లు చేపడుతున్నాం’’ అని ఆయన ఒక టెలివిజన్ ప్రసంగంలో ప్రకటించారు. ఇరాక్, సిరియాల మధ్య అంతర్యుద్ధం కారణంగా ఏర్పడిన అధికార శూన్యతను రెండేళ్ల క్రితం ఐఎస్ ఉగ్రవాదులు అనుకూలంగా వినియోగించుకుని మోసుల్‌పై తమ జెండా ఎగురవేశారు. అప్పటి నుంచి మోసుల్ వారిచేతిలోనే ఉండిపోయింది. అయితే ఇటీవలి కాలంలో అమెరికా సంకీర్ణ దళాలు, ఇరాకీ బలగాలు, ఇతర ఐఎస్ వ్యతిరేక గ్రూపులు కలిసి మోసుల్‌ను అష్టదిగ్బంధనం చేస్తున్నాయి. అయితే ఇరాక్ ప్రధాని తాజాగా చేసిన ప్రకటనతో ఐరాస మానవ హక్కుల వ్యవహారాలు, అత్యవసర సహాయ కార్యక్రమాల విభాగం డిప్యూటీ సెక్రటరీ జనరల్ స్టీఫెన్ ఒ బ్రెయిన్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘మోసుల్‌లో ఉన్న పదిహేను లక్షల మంది ప్రజల పరిస్థితిపై ఆందోళనగా ఉంది. ఇరాక్ మిలటరీ ఆపరేషన్లతో ముందుగా ప్రభావితులయ్యేది వారే.’’ అని అన్నారు. యుద్ధ తీవ్రతను బట్టి కనీసం పది లక్షల మంది తమ ఇళ్లను వదిలి వెళ్లాల్సి వస్తుందని ఆయన అన్నారు.

మోసుల్‌పై దాడికి సమాయత్తమవుతున్న ఇరాక్ సైనికులు