అంతర్జాతీయం

రోదసిలోకి షెంఝూ-11

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, అక్టోబర్ 17: ఇద్దరు వ్యోమగాములతో కూడిన అంతరిక్షనౌకను చైనా విజయవంతంగా ప్రయోగించింది. ఉత్తర చైనాలోని జిఖ్వియన్ శాటిలైట్ లాంచింగ్ సెంటర్ నుంచి భారత కాలమాన ప్రకారం సోమవారం ఉదయం 5 గంటలకు నౌకను కక్ష్యలోకి పంపింది. జింగ్ హైపెంగ్ (50), చెన్ డాంగ్ (37)లతో కూడిన షెంఝూ-11 అంతరిక్ష నౌకను ప్రయోగించినట్టు చైనా ప్రకటించింది. వ్యోమగాములు నెల రోజులపాటు అంతరిక్షంలోనే ఉండి వివిధ అంశాలపై పరిశోధనలు చేస్తారు. ‘30 రోజులు అక్కడే ఉండి టింగాంగ్ అంతరిక్ష పరిశోధన ల్యాబ్‌లో పరిశోధనలు చేస్తారు. మా వ్యోమగాములు ఇన్ని రోజులు అంతరిక్షంలోనే గడపడం ద్వారా మరో మైలురాయిని చేరుకున్నాం’ అని చైనా అంతరిక్ష పరిశోధన శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఊ పింగ్ స్పష్టం చేశారు. అంతరిక్ష నౌక ప్రయోగాన్ని చైనా టెలివిజన్‌లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. అంతరిక్షంలో మానవుడు స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి సంబంధించి పలు అంశాలపై జిఖ్వియన్-11 పరిశోధనలు చేస్తుందని ఆయన తెలిపారు. అంతరిక్ష నౌక విజయవంతంపై ప్రస్తుతం భారత్‌లో బ్రిక్స్ సదస్సులో ఉన్న చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ హర్షం వ్యక్తం చేశారు. శాస్తవ్రేత్తలకు ఆయన అభినందనలు తెలిపారు.