అంతర్జాతీయం

సౌదీ యువరాజుకు ఉరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియాద్, అక్టోబర్ 19: సౌదీ చరిత్రలో ఓ అరుదైన ఉరిశిక్ష అమలుచేశారు. ఒక వ్యక్తి మృతికి కారణమైన సౌదీ రాజ కుటుంబానికి చెందిన ఓ యువరాజుకే ఏకంగా మరణశిక్ష అమలు చేశారు. సౌదీ యువరాజు తుర్కీ బిన్ సౌద్ అల్ అబీర్‌ను బుధవారం ఉరితీసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. 2012 డిసెంబర్‌లో రియాద్‌లోని డిజెర్ట్ క్యాంపులో జరిగిన ఘర్షణ సందర్భంగా యువరాజు అబీర్ కాల్పులు జరిపాడు. యువరాజు కాల్పుల్లో అదెల్ అల్‌మహ్మద్ అనే వ్యక్తి మృతి చెందాడు. మరొకరు గాయపడ్డారు. కాల్పుల్లో చనిపోయిందని తన స్నేహితుడేనని యువరాజుకు తరువాత తెలిసింది. వెంటనే పోలీసులకు లొంగిపోయి ఈ విషయం తెలిపాడు. కేసును విచారించిన రియాద్ న్యాయస్థానం యువరాజు అబీర్‌కు మరణశిక్ష ఖరారు చేసింది. మొత్తానికి హత్యకేసులో యువరాజు తుర్కి బిన్ సౌద్ అల్ అబీర్‌కు బుధవారం మరణశిక్ష విధించినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. హత్య, తదితర తీవ్రమైన కేసుల్లో ఈ ఏడాది ఇప్పటి వరకూ సౌదీలో అమలుచేసిన 134 ఉరిశిక్షల్లో యువరాజుది ఒకటని అంతరంగిక మంత్రిత్వశాఖ వెల్లడించింది. యువరాజుకే మరణశిక్ష విధించడం ద్వారా సౌదీలో న్యాయవ్యవస్థ ఎంత సమర్ధవంతంగా, పారదర్శకంగా అమలవుతుందో తేటతెల్లమైందని అదెల్ బంధువు అబ్దుల్ రెహ్మాన్ అల్ ఫలాజ్ వ్యాఖ్యానించారు. సౌదీలో శిరచ్ఛేదనం ద్వారానే మరణశిక్షలు అమలు చేస్తుంటారు. అయితే యువరాజు అబీల్‌కు మరణశిక్ష ఎలా అమలుచేసిందీ తెలియరాలేదు. సౌదీ అరేబియాలో ఇస్లామిక్ న్యాయచట్టాలు చాల కఠినంగా ఉంటాయి. హత్యలు, మాదకద్రవ్యాల స్మగ్లింగ్, ఆయుధాల దోపిడీ, అత్యాచారాలు, మత సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేస్తే మరణశిక్ష విధిస్తారు. ఆధునిక సమాజంలో మరణశిక్షలు అమలుచేయడంపై అమ్నేస్టీ అంతర్జాతీయ సంస్థ తప్పుపడుతోంది. 2015లో ఏకంగా 158 ఉరిశిక్షలు అమలుచేసినట్టు సంస్థ పేర్కొంది. ఇరాన్, పాకిస్తాన్ తరువాత మరణశిక్షలు అమలుచేస్తున్న మూడో దేశం సౌదీ అరేబియానే.