అంతర్జాతీయం

కాదంటే.. మేమే ధ్వంసం చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, అక్టోబర్ 23:ఉగ్రవాద స్థావరాలను నిర్మూలించడంలో మీనమేషాలు లెక్క పెడుతున్న పాకిస్తాన్‌పై అమెరికా నిప్పులు చెరిగింది. పాక్‌ను కేంద్రంగా చేసుకుని హింసా, విధ్వంసకాండలకు పాల్పడుతున్న ఉగ్రవాద నెట్‌వర్క్‌లను ధ్వంసం చేయడానికి నేరుగా తామే రంగంలోకి దిగాల్సి వస్తుందని తీవ్ర స్వరంతో హెచ్చరించింది. తమ భూభాగాన్ని ఆసరా చేసుకుని పని చేస్తున్న ఉగ్రవాద గ్రూపులపై పాక్ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ ఇంత వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదని..అందుకే తామే నేరుగా దాడులు చేస్తామని హెచ్చరించాల్సి వచ్చిందని అమెరికా తెలిపింది. పాకిస్తాన్ ప్రభుత్వంలోని కొన్ని వర్గాలు ఉగ్రవాదులకు అనుకూలంగా, మరికొన్ని వర్గాలు వ్యతిరేకంగా వ్యవహరించడం వల్ల గందరగోళ పరిస్థితి తలెత్తుతోందని, అత్యంత శక్తివంతమైన ఐఎస్‌ఐలోనే ఈ రకమైన విభేదాలు కనిపిస్తున్నాయని అమెరికా సీనియర్ మంత్రి ఆడం సూబిన్ అన్నారు. కొన్ని ఉగ్రవాద వర్గాలను ఐఎస్‌ఐలోని ఒక వర్గం ప్రోత్సహిస్తున్న విషయమూ స్పష్టమవుతోందని తెలిపారు. దేశంలోని అన్ని ఉగ్రవాద సంస్థలపైనా చర్యలు చేపట్టాల్సిందేనని..ఇందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఉగ్రవాదాన్ని పెంచిపోషించేందుకు ఉపకరిస్తున్న అన్ని మార్గాలను మూసేసందుకు ఉద్దేశించిన కీలక శాఖకు సహాయ ఉప మంత్రిగా ఆడం పని చేస్తున్నారు. ఉగ్రవాద వ్యతిరేక చర్యల విషయంలో పాకిస్తాన్‌కు సహకరించేందుకు తాము ఎంతగా ముందుకు వస్తున్నామో.. అవసరమైతే తామే నేరుగా ఈ దాడులు చేపట్టేందుకూ వెనుకాడే ప్రసక్తే ఉండదని ఆడం ఉద్ఘాటించారు. ఇప్పటికే ఎన్నో సార్లు ఉగ్రవాద దాడులకు గురైన పాకిస్తాన్ ఎన్నో విధాలుగా నష్టపోయిందన్నారు. కొన్ని ఉగ్రవాద స్థావరాలనూ నిర్మూలించిందని పేర్కొన్న ఆయన ఐఎస్‌ఐ అనుసరిస్తున్న ద్వంద్వ ప్రమాణాల వల్లే సమస్య తలెత్తుతోందని తెలిపారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించే విషయంలో ఎలాంటి తరతమ్యాలకు తావుండకూడదని ఉద్ఘాటించారు. హక్కానీ, తాలిబన్ మిలిటెంట్లపై అనుసరిస్తున్న వైఖరే వీరి పట్ల ఐఎస్‌ఐ సానుకూలతకు నిదర్శనమని చెప్పారు.