అంతర్జాతీయం

నన్నూ వేధించాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీవ్‌లాండ్, అక్టోబర్ 23: అమెరికా అధ్యక్ష పదవికోసం పోటీ పడుతున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గతంలో మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారనే ఆరోపణల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా పెద్దలు మాత్రమే చూడవలసిన సినిమాలలో నటించే ఒక నటి, డైరెక్టర్ జెస్సికా డ్రేక్ గతంలో ట్రంప్ తనను లైంగికంగా వేధించారని ఆదివారం ఆరోపించారు. ట్రంప్ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు వెల్లడించే 2005 నాటి ఒక వీడియో బయటపడిన తరువాత ఆయన తమను లైంగికంగా వేధించారని బహిరంగంగా ఆరోపించిన వారిలో డ్రేక్ 11వ మహిళ. 2006లో ఒకసారి ట్రంప్ తనను తన సూట్‌కి రమ్మని ఆహ్వానించారని, అయితే ఒంటరిగా వెళ్లడం ఇష్టం లేక తాను మరో ఇద్దరు మహిళా స్నేహితులను తీసుకొని వెళ్లానని 42 ఏళ్ల డ్రేక్ చెప్పారు. అయితే ట్రంప్ తమ అనుమతి లేకుండా తమలో ప్రతి ఒక్కరినీ గట్టిగా కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నారని డ్రేక్ ఆరోపించారు.
దీంతో సుమారు అరగంటలోనే తాము అక్కడి నుంచి బయటకు వచ్చామన్నారు. తరువాత ట్రంప్ సహాయకుడు ఒకరు తనకు ఫోన్ చేసి ఒంటరిగా ట్రంప్ గదికి రావాలని కోరగా, తాను నిరాకరించినట్లు చెప్పారు. ఆ తరువాత నేరుగా ట్రంప్ ఫోన్ చేసి, ఏమి కావాలని అడిగారని, తాను ఒంటరిగా వస్తే పది వేల డాలర్లు ఇస్తానని, తన ప్రైవేట్ జెట్ విమానాన్ని వినియోగించుకోవచ్చని అన్నారని డ్రేక్ చెప్పారు. అయితే తాను నిరాకరించినట్లు ఆమె వెల్లడించారు.