అంతర్జాతీయం

విజయం నాదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్లీవ్‌లాండ్ (అమెరికా), అక్టోబర్ 23: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గెలిచే అవకాశాలు చాలా స్వల్పంగా ఉన్నాయని ఒకవైపు ప్రధాన స్రవంతి మీడియా, రాజకీయ పండితులు అంచనా వేసినప్పటికీ, ట్రంప్ మాత్రం సార్వత్రిక ఎన్నికల్లో తాను గెలిచి తీరుతానని నొక్కిచెప్పారు. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి అయిన 68 ఏళ్ల హిల్లరీ క్లింటన్ పలు కీలక రాష్ట్రాలలో ట్రంప్ కన్నా ఏడు పాయింట్లకు పైగా ఆధిక్యతలో ఉన్నారు. అయినప్పటికీ ఏమాత్రం ఆందోళన చెందని ట్రంప్ తాను వైట్‌హౌస్‌ను చేరుకునే మార్గంలో సాగుతున్నానని ధీమా వ్యక్తం చేశారు. క్లీవ్‌లాండ్‌లో పది వేలకు పైగా మంది ప్రజలు పాల్గొన్న ఎన్నికల సభలో ట్రంప్ మాట్లాడుతూ ‘నవంబర్ 8న జరిగే ఎన్నికల్లో మనం విజయం సాధించబోతున్నాం. ఇతరులు గెలిచే అవకాశమే లేదు’ అని అన్నారు. ఈ సభలో ట్రంప్‌తో పాటు రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి మైక్ పెన్స్, న్యూయార్క్ నగర మాజీ మేయర్ రూడీ గియులియాని పాల్గొన్నారు. అయితే బహిరంగ సభకు హాజరయిన ఒక గ్రూపు ట్రంప్ ఉపన్యాసానికి అడ్డు తగిలింది. వారు హిల్లరీ క్లింటన్ నుంచి డబ్బు తీసుకొని సభకు అంతరాయం కలిగిస్తున్నారని ట్రంప్ ఆరోపించారు. అంతరాయం కలిగించేవారు సభలోనుంచి వెళ్లిపోవాలని ఆయన డిమాండ్ చేశారు. ‘ఆమె (హిల్లరీ క్లింటన్) ఉద్దేశమంతా ఎన్నికల ప్రక్రియను రిగ్గింగ్ చేయడమే’ అని ట్రంప్ ఆరోపించారు. అమెరికా విదేశాంగ మంత్రిగా హిల్లరీ క్లింటన్ ఘోర వైఫల్యం చెందడం వల్లనే మధ్యప్రాచ్యంలో ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాద సంస్థ బాగా బలపడిందని ట్రంప్ ఆరోపించారు. ఇప్పుడు ఐఎస్‌ఐఎస్ 32 దేశాలకు విస్తరించిందని పేర్కొంటూ అసలు హిల్లరీ క్లింటన్ ఐఎస్‌ఐఎస్‌ను ఎందుకు ఎదగనిచ్చారని ప్రశ్నించారు. ప్రపంచ వ్యాప్తంగా ఐఎస్‌ఐఎస్ చేసిన మారణకాండకు, విధ్వంసకాండకు హిల్లరీ క్లింటన్ బాధ్యత వహించాలని ట్రంప్ అన్నారు.