అంతర్జాతీయం

విజేతను నిర్ణయంచేది చిన్నరాష్ట్రాలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, అక్టోబర్ 26: అమెరికా అధ్యక్ష పదవికి సరిగ్గా రెండు వారాలు మిగిలి ఉన్న నేపథ్యంలో అభ్యర్థుల విజయానికి చిన్న రాష్ట్రాలు కీలకంగా మారనున్నాయి. పెద్ద రాష్ట్రాల్లో ఓటర్లు ఎవరి పక్షంలో నిలిచినప్పటికీ, పెన్సిల్వేనియా, ఓహియో వంటి రాష్ట్రాలు నిర్ణయాత్మక శక్తిగా మారనున్నాయి. ఈ రాష్ట్రాల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అంతగా రాణించలేకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆయన సొంత రాష్ట్రం న్యూయార్క్‌లో సైతం ట్రంప్‌కు ఎదురుదెబ్బ తగలవచ్చని కూడా న్యూయార్క్ సిటీ యూనివర్సిటీ డైరెక్టర్ స్టీవెన్ రోమాలెవ్‌స్కీ అన్నారు. పెన్సిల్వేనియాలో ఉన్న 20 ఎలక్టోరల్ ఓట్లు హిల్లరీకే పడతాయని ఆయన అన్నారు. ‘గత మూడు ఎన్నికల్లోనూ పెన్సిల్వేనియా డెమొక్రాట్లకే ఓటేస్తున్నాయి. ఈసారి ఎన్నికలు ప్రత్యేకమైనవి. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రైమరీ ఎన్నికల్లో బాగానే రాణించినప్పటికీ, తనను తాను అధ్యక్ష పదవి స్థాయికంటే తక్కువ చేసుకున్నారు. హిల్లరీ ఇక్కడ రాణించవచ్చు అయితే తుది ఫలితాల్ని అంచనా వేయటం చాలా కష్టం’’ అని ఆయన పేర్కొన్నారు. న్యూయార్క్ చరిత్రను గమనిస్తే ఎక్కువసార్లు ఇక్కడి ఓటర్లు డెమొక్రాట్లకే పట్టం గట్టారు. ఈసారి కూడా అదే చరిత్ర పునరావృతమయ్యే అవకాశాలున్నాయని ఆయన వివరించారు. ఇక్కడ పడే ఓట్లనుబట్టి ఎన్నికల్లో విజేత ఎవరనేది తేలుతుందని అన్నారు.