అంతర్జాతీయం

భారతీయులంటే ట్రంప్‌కు గౌరవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాష్‌బర్న్, అక్టోబర్ 26: అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఎన్నికలు సమీపిస్తుండటంతో భారతీయ అమెరికన్లను ఆకట్టుకునే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారం పుణ్యమా అని అమెరికాలో దీపావళి పండుగ ముందుగానే వచ్చేసింది. భారతీయ సంతతి అధికంగా నివసించే వర్జీనియాలోని ఓ హిందూ ఆలయంలో జరిగిన దీపావళి వేడుకకు డొనాల్డ్ ట్రంప్ కోడలు లారా ట్రంప్ హాజరయ్యారు. భారతీయ సంస్కృతిని, భారతీయులను డొనాల్డ్ ట్రంప్ అమితమైన ప్రేమిస్తారని, ఆయన అధ్యక్షుడైతే ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింతగా పెరుగుతాయని లారా ట్రంప్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. వర్జీనియాలోని రాజధాని టెంపుల్‌కు విచ్చేసిన లారాట్రంప్ తన బూట్లు ఆలయం బయటే విప్పి భారతీయ సంస్కృతిపై తనకున్న గౌరవాన్ని చాటారు. హిందూ సంస్కృతిని తాను గౌరవిస్తానని కూడా ఆమె పేర్కొన్నారు. దీపావళి వేడుకలకు లారా ట్రంప్ హాజరుకావడంలో భారతీయ అమెరికన్ రాజేష్ గూటి కీలకపాత్ర పోషించారు. లారా రాకతో వర్జీనియాలోని ఫెయిర్‌ఫాక్స్, లౌడోన్ కౌంటీల్లో దీపావళి ముందుగానే వచ్చినట్లయిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వేడుకలకు ట్రంప్ కుమార్తె ఇవాంకా హాజరుకావాల్సి ఉన్నా వేరే ప్రాంతంలో ప్రచారంలో ఉండటంతో రాలేకపోయారు. కాగా, అధ్యక్ష బరిలో ఉన్న అభ్యర్థుల కుటుంబ సభ్యులు ఓ హిందూ ఆలయాన్ని సందర్శించడం ఇదే తొలిసారి.