అంతర్జాతీయం

హిల్లరీవైపే మొగ్గు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, నవంబర్ 8: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మంగళవారం ఓటింగ్ ప్రారంభమయింది. అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డెమోక్రటిక్ పార్టీ అన్యర్థి హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ పార్టీ ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్‌లలో ఎవరు దేశాన్ని పాలించనున్నారో దాదాపు 20 కోట్ల మంది ఓటర్లు మంగళవారం నిర్ణయించనున్నారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమయింది. అన్ని ఎన్నికల్లో మాదిరిగానే ఈ ఎన్నికల్లో కూడా తొలి ఓటు న్యూహాంప్‌షైర్‌లోని డిక్స్‌విల్లే నాచ్‌లో మొదలైంది. ఇక్కడ పోలయిన ఆరు ఓట్లలో నాలుగు ఓట్లు హిల్లరీకి, ట్రంప్‌కు రెండు ఓట్లు వచ్చాయి. అభ్యర్థుల వ్యక్తిత్వాలే ప్రధాన అంశాలుగా దాదాపు ఏడాది పాటు సాగిన ప్రచారానికి ముగింపు పలుకుతూ, 69 ఏళ్ల హిల్లరీ క్లింటన్. 70 ఏళ్ల ట్రంప్‌లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయాలని, తమను గెలిపించాలంటూ తమ మద్దతుదారులకు చివరిసారిగా విన్నపం చేశారు. హిల్లరీ క్లింటన్ నార్త్ కరోలినా రాట్రంలోని రలీఘ్‌లో భారీ ర్యాలీలో ప్రసంగించగా, ట్రంప్ మిచిగాన్‌లో చివరి ర్యాలీ నిర్వహించారు.
రాయిటర్ వార్తాసంస్థ నిర్వహించిన తాజా పోల్ ప్రకారం హిల్లరీ క్లింటన్‌కు విజయవకాశాలు 90 శాతం ఉన్నాయి. అంతేకాదు అధ్యక్ష పదవికి ఎన్నిక కావడానికి 270 ఎలక్టోరల్ కాలేజి ఓట్లు అవసరం కాగా, హిల్లరీ క్లింటన్‌కు 303 ఎలక్టోరల్ కాలేజి ఓట్లు లభిస్తాయని, ట్రంప్‌కు 235 ఎలక్టోరల్ ఓట్లు వస్తాయని కూడా ఆ సంస్థ అంచనా వేసింది. కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికలను అత్యంత ఆసక్తిగా గమనిస్తున్న ప్రపంచ మార్కెట్లు సైతం హిల్లరీ క్లింటన్ విజయం సాధించవచ్చన్న అంచనాల నేపథ్యంలో లాభాలతో ముగిశాయి. కాగా, డాలర్, బాండ్లపై లాభాలు పడిపోగా, బంగారం ధరలు పెరిగాయి.
మంగళవారం ఉదయం న్యూయార్క్‌లోని తన స్వస్థలమైన చప్పాక్వాలోని ఓ ఎలిమెంటరీ స్కూలులో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి ఓటు వేయడానికి భర్త బిల్ క్లింటన్‌తో కలిసి వచ్చారు. కాగా, ట్రంప్ మన్‌హట్టన్‌లో ఓటు వేయనున్నారు. ఆయన మంగళవారం ఉదయం ‘్ఫక్స్ అండ్ ఫ్రెండ్స్’ మార్నింగ్ న్యూస్ కార్యక్రమంలో పాల్గొని తనను గెలిపించాల్సిందిగా ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
ఇద్దరు కూడా మంగళవారం సాయంత్రం ఓటింగ్ ముగిసిన తర్వాత న్యూయార్క్ సిటీకి ఒక మైలు దూరంలో విక్టరీ ర్యాలీ నిర్వహిస్తామని చెప్పడం గమనార్హం. ఉపాధ్యక్ష పదవికి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ఉన్న టిమ్ కెయిన్ తన భార్యతో కలిసి వర్జీనియాలోని రిచ్‌మండ్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక అధ్యక్ష పదవికి బరిలో ఉన్న ఇద్దరు అభ్యర్థులు కూడా తామే విజయం సాధిస్తామన్న ధీమాతో ఉండడం గమనార్హం. అయితే అందరి దృష్టి కూడా కీలక రాష్ట్రాలయిన నార్త్ కరోలినా, ఫ్లోరిడా రాష్ట్రాలపైనే ఉంది. ప్రారంభంలో హిల్లరీ క్లింటన్‌కు అనుకూలంగా ఉండిన ఈ రెండు రాష్ట్రాల్లో కూడా పోటీ ఎన్నికల తేదీ దగ్గరయ్యే కొద్దీ నువ్వా, నేనా అన్నట్లుగా తయారైంది. ఈ రాష్ట్రాల్లో గనుక ట్రంప్ ఆధిక్యం సాధిస్తే హిల్లరీ విజయావకాశాలు తారుమారయ్యే అవకాశం ఉంది.

chitram...

ఓటువేశాక క్లింటన్‌ను ముద్దాడుతున్న హిల్లరీ