అంతర్జాతీయం

అమెరికా ఎన్నికల్లో మేము సైతం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, నవంబర్ 8: గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రస్తుత అమెరికా ఎన్నికల్లో భారతీయ సంతతికి చెందిన మహిళలు ఇటు రిపబ్లికన్, అటు డెమొక్రాట్ పార్టీల్లో ప్రముఖ పాత్ర పోషించారు. ప్రచారపరంగా అత్యంత కీలకమైన పదవులే నిర్వహించి తమ సమర్థతను మరోసారి చాటుకున్నారు. ముఖ్యంగా డెమొక్రాట్ అభ్యర్థిగా పోటీచేసిన హిల్లరీ క్లింటన్ ప్రచారానికి సంబంధించిన పలు విభాగాల్లో వీరి పాత్ర గణనీయంగానే ఉంది. ఈ కమ్యూనిటీ నుంచి తొలి సెనేటర్‌గా డెమొక్రాట్ అభ్యర్థి కమలా హారిస్ ఎన్నికయ్యే అవకాశాలు ప్రస్ఫుటమవుతున్నాయి. డెమొక్రాట్ అభ్యర్థిగా హిల్లరీ క్లింటన్ పోటీ ప్రభావం, అలాగే సౌత్ కరోలినా గవర్నర్‌గా పనిచేసిన నిక్కీ హేలీ చేసిన కృషి కమలా హారిస్ ఎన్నికను మరింతగా సుగమం చేసింది. ఇప్పటికే రెండుసార్లు సౌత్ కరోలినా గవర్నర్‌గా పనిచేసిన నిక్కీ హేలీ జాతీ య రాజకీయాలపై తనదైన ముద్ర వేశారు. క్లింటన్ ప్రచార కూటమిలో ఇద్దరు భారతీయ అమెరికన్ మహిళలకు క్రియాశీలక భూమిక లభించింది. వీరిలో నీరా టాండన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఒకవేళ క్లింటన్ అధ్యక్షురాలిగా ఎన్నికైతే ఆమె మంత్రివర్గంలో నీరా టాండన్‌కు కీలక పదవి లభించే అవకాశాలున్నట్లుగా కథనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం నీరా టాండన్ సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగెస్ అనే మేధో సంస్థ సారధిగా పనిచేస్తున్నారు. అలాగే హిల్లరీ క్లింటన్‌కు అత్యంత వ్యక్తిగత సన్నిహితురాలిగా పేర్కొంటున్న హ్యూమా అబ్డీన్ కూడా క్లింటన్ ప్రచార కూటమిలో గురుతర పాత్రనే పోషించారు.
మినీ తిమ్మరాజు అనే ఇండో అమెరికన్ మహిళ కూడా హిల్లరీ ప్రచారంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు. మహిళలను ఆకట్టుకునే బాధ్యతను ఆమె నిర్వర్తించారు. అలాగే మాయా హారిస్ కూడా హిల్లరీకి విధాన సలహాదారుల్లో ఒకరుగా పనిచేశారు. షఫాలీ రాజ్‌దాన్ దుగ్గల్ అనే భారతీయ అమెరికన్ మహిళ హిల్లరీ జాతీయ, ఆర్థిక బృందంలో తనదైన రీతిలో సేవలందించారు. కేవలం డెమొక్రాటిక్ పార్టీలోనే కాకుండా రిపబ్లికన్ పార్టీలో కూడా ఇండో అమెరికన్ మహిళలు కీలక భూమికనే పోషించారు. రిపబ్లికన్ పార్టీ జాతీయ కమిటీలో భాగంగా ఉన్న జాతీయ మహిళా కమిటీలో కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తున్న హర్మీత్ థిల్లాన్ క్రియాశీలక పాత్ర పోషించారు. రిపబ్లికన్ పార్టీ చరిత్రలో తొలిసారిగా కాలిఫోర్నియా విభాగానికి ఉప చైర్‌పర్సన్‌గా పనిచేశారు. అలాగే ఫ్లోరిడాలో వృద్ధుల వ్యవహారాలకు సంబంధించిన విభాగంలో సలహాదారుగా పనిచేస్తున్న మేరీ థామస్ కూడా అమెరికా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాలన్న ఆసక్తితో ఉన్నారు. మొత్తమీద అమెరికాకు చెందిన రెండు జాతీయ పార్టీల్లోనూ భారతీయ అమెరికన్ మహిళలు క్రియాశీలత స్పష్టం కావడమే కాకుండా ప్రస్తుత ఎన్నికల్లో మరింత ప్రస్ఫుటమైంది.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుపొందాలని కోరుకుంటూ మంగళవారం పాట్నాలో యజ్ఞాన్ని నిర్వహిస్తున్న అఖిల భారతీయ హిందూ మహాసభ కార్యకర్తలు