అంతర్జాతీయం

ట్రంప్‌కు మోదీ అభినందనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, నవంబర్ 9: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన రిపబ్లికన్‌పార్టీ అభ్యర్తి డొనాల్డ్ ట్రంప్‌కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ట్రంప్ హయాంలో భారత్-అమెరికా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడాలని మోదీ ఆకాంక్షించారు. అమెరికా 45వ అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్‌ను అభినందిస్తూ ప్రధాని ట్వీట్ చేశారు. ఇరుదేశాల మధ్య మైత్రిలో కొత్తశకం కావాలని ఆయన అన్నారు. ఎన్నికల ప్రచారంలో భారత్‌పై స్నేహపూరిత భావన వ్యక్తం చేసిన ట్రంప్‌ను మోదీ ప్రశంసించారు. ‘మీ హయాంలో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి’ అని ప్రధాన తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.