అంతర్జాతీయం

ఓట్లు ఎక్కువ.. సీట్లు తక్కువ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, నవంబర్ 10: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ తన ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్‌పై అనూహ్య విజయం సాధించినప్పటికీ ఎక్కువ పాపులర్ ఓట్లు పొందిన అభ్యర్థిగా ఆమె నిలిచారని మీడియా కథనాలు గురువారం పేర్కొన్నాయి. బుధవారం సాయంత్రం హిల్లరీ క్లింటన్ తన ఓటమిని అంగీకరిస్తూ డొనాల్డ్ ట్రంప్‌కు ఫోన్ చేసిన కొద్ది గంటలకే ఆమె ట్రంప్‌పై పాపులర్ ఓట్ల విషయంలో స్వల్ప ఆధిక్యత సాధించారు. పోలయిన ఓట్లలో 92 శాతం ఓట్లు లెక్కించే సమయానికి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి అయిన హిల్లరీ క్లింటన్‌కు 47.7 శాతం ఓట్లు రాగా, ట్రంప్‌కు 47.5 శాతం ఓట్లు వచ్చాయి. అంటే హిల్లరీ క్లింటన్‌కు 5,97,55,284 ఓట్లు రాగా, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి అయిన ట్రంప్‌కు 5,95,35,522 ఓట్లు వచ్చినట్లు సిఎన్‌ఎన్ తెలిపింది. ఇప్పటివరకు దాదాపు 12 కోట్ల ఓట్లను లెక్కించడాన్ని బట్టి చూస్తే 2,19,762 ఓట్ల తేడా అనేది చాలా తక్కువ అని ఆ చానల్ తెలిపింది. పరోక్ష ఓట్ల లెక్కింపు తర్వాత ఇరువురు అభ్యర్థులకు వచ్చిన ఓట్ల మొత్తాలు మారే అవకాశముంది. 2012లో మిట్ రోనీ ఓటమి పాలయినప్పుడు అమెరికా ఎలక్టోరల్ కాలేజి విధానం ప్రజాస్వామ్యానికే వినాశకారి అని వ్యాఖ్యానించిన ట్రంప్‌కే ఇప్పుడు అలాంటి విచిత్ర పరిస్థితి ఎదురు కావడం గమనార్హం. మొత్తం ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత కూడా హిల్లరీ తన ఆధిక్యతను ఇలాగే కొనసాగించినట్లయితే 2000 సంవత్సరంలో అల్ గోరే తర్వాత పాపులర్ ఓటులో విజయం సాధించినప్పటికీ ఎన్నికల్లో ఓడిపోయిన తొలి అధ్యక్ష అభ్యర్థి ఆమే అవుతారు. 2000 సంవత్సరంలో జార్జి డబ్ల్యు బుష్ చేతిలో అల్ గోరే ఓటమి పాలు కావడానికి ముందు కూడా ముగ్గురు అభ్యర్థులు ఆండ్రూ జాక్సన్, శామ్యుయెల్ టిల్డెన్, గ్రోవర్ క్లెవర్‌లాండ్‌లు కూడా ఇదే విధంగా పాపులర్ ఓటులో విజయం సాధించినప్పటికీ అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.
ఎన్నికల్లో ఓడిపోయన అనంతరం మాట్లాడుతున్న హిల్లరీ