అంతర్జాతీయం

‘ముస్లింలపై నిషేధం’ ప్రకటన అదృశ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, నవంబర్ 11: అమెరికాలోకి ముస్లింలు ప్రవేశించకుండా నిషేధిస్తాననేది అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ప్రధాన వాగ్దానాలలో ఒకటి. అయితే అతను అధ్యక్షుడిగా ఎన్నికయిన మరుసటి రోజు గురువారం అతని ప్రచార వెబ్‌సైట్‌లో ఈ వాగ్దానం కనిపించకుండా పోయింది. దీని గురించి కొంతమంది జర్నలిస్టులు అడగ్గా, సాంకేతిక సమస్య వల్ల వెబ్‌సైట్‌లో అది కనిపించకుండా పోయిందని ట్రంప్ ప్రచార సిబ్బంది బదులిచ్చారు. కాలిఫోర్నియాలోని శాన్ బెర్నార్డినోలో డిసెంబర్‌లో ఉగ్రవాద దాడులు జరిగిన తరువాత ట్రంప్ చేసిన ఈ వాగ్దానాన్ని అప్పట్లో వెబ్‌సైట్‌లో పెట్టారు. అయితే గురువారం జర్నలిస్టులు అదృశ్యమైన ఆ వాగ్దానం గురించి అడిగిన తరువాత, అది తిరిగి వెబ్‌సైట్‌లో కనిపించింది. ‘వెబ్‌సైట్ తాత్కాలికంగా అన్ని నిర్దిష్టమైన ప్రెస్ రిలీజ్‌లను తిరిగి హోంపేజీలోకి రీడైరెక్ట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ సమస్యను పరిష్కరిస్తున్నాం. త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుంది’ అని ట్రంప్ ప్రచార సిబ్బంది ఒక ప్రకటనలో వివరించారు. అయితే అప్పట్లో ట్రంప్ ఉగ్రవాదంతో రాజీపడుతున్న దేశాల నుంచి ముస్లింలు అమెరికాలోకి ప్రవేశించడాన్ని నిషేధిస్తానని తరువాత తన వాగ్దానాన్ని కొంత సవరించుకున్నారు.