అంతర్జాతీయం

మెక్సికో సరిహద్దులో ఇక గోడ నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, నవంబర్ 11: అమెరికా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను సంస్కరించడానికి కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికయిన డొనాల్డ్ ట్రంప్ పాలనాయంత్రాంగం పది సూత్రాల కార్యాచరణ ప్రణాళికను అమలు చేయనుంది. మెక్సికో సరిహద్దులో గోడ నిర్మించడం, కొన్ని దేశాలకు చెందిన వారికి వీసాలు ఇవ్వకుండా నిలిపివేయడం వంటివి ఈ ప్రణాళికలో ఉన్నాయి. ట్రంప్ ట్రాన్సిషన్ టీమ్ శుక్రవారం ఈ విషయం వెల్లడించింది. డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని కొత్త పాలనాయంత్రాంగం దేశ రక్షణకు, ప్రజల భద్రతకు ముప్పు పొంచి ఉన్న మూడు రంగాలు- రాడికల్ సిద్ధాంతాలు, అణ్వస్త్రాలు, సైబర్ దాడులపైన కేంద్రీకరించనుందని ఆ బృందం వివరించింది. అయితే పది సూత్రాల కార్యాచరణ ప్రణాళిక అని ఆ బృందం తెలిపినప్పటికీ వాటి గురించి సమగ్రమైన సమాచారం మాత్రం అందుబాటులో లేదు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ట్రంప్ చేసిన ప్రకటనలకు అనుగుణంగా విధానాలు రూపొందించడం జరుగుతుందని ట్రాన్సిషన్ టీమ్ స్థూలంగా తెలియచేసింది. ఈ పది సూత్రాల ప్రణాళికలో ఇతర దేశాలకు చెందిన నేరస్థుల పట్ల ఏమాత్రం ఉదాశీనత చూపకపోవడం, రాజ్యాంగ విరుద్ధమైన కార్యనిర్వాహక ఆదేశాలను రద్దు చేయడం, అన్ని ఇమ్మిగ్రేషన్ చట్టాలను పకడ్బందీగా అమలు చేయడం, తగిన పరిశీలనలు, తనిఖీలు జరుపకుండా వీసాలను జారీ చేసే విధానాన్ని నిలిపివేయడం వంటివి ఉన్నాయి.