అంతర్జాతీయం

ఐరాసలో అమెరికా రాయబారిగా నిక్కీహేలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, నవంబర్ 23: అమెరికా కొత్త విదేశాంగ మంత్రిగా నియమితమవుతాననుకున్న ఇండో అమెరికన్ నిక్కీహేలీకి ఐరాసలో అమెరికా రాయబారి పదవి దక్కింది.
ఇందుకు సంబంధించి దేశాధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నట్లుగా కథనాలు వెలువడ్డాయి. దక్షిణ కరోలినా గవర్నర్‌గా ఉన్న 44 ఏళ్ల నిక్కీహేలీ ఇటీవలే ట్రంప్‌ను కలుసుకున్నారు. ముఖ్యంగా ప్రతిష్ఠాత్మక మైన విదేశాంగ మంత్రి పదవి ఆమెకే దక్కుతుందని చాలా బలంగానే ఆ సమయంలో అంచనాలు వెలువడ్డాయి.
ఇప్పటి వరకు అమెరికా ప్రభుత్వంలో కేబినెట్ ర్యాంకు అధికార పదవిని ఏ భారతీయ మహిళ పొందలేదు. ఆ ఘనత నిక్కీహేలీకే దక్కుతుంది. అయితే ఈ తాజా నియామకాన్ని కేబినెట్ ఆమోదించాల్సి ఉంటుంది.