అంతర్జాతీయం

అస్తమించిన వీరుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్యూబా మహాయోధుడు క్యాస్ట్రో కన్నుమూత
ప్రపంచ వామపక్ష ఉద్యమానికి తీరని విఘాతం
నాలుగు రోజులపాటు సాగనున్న అంతిమయాత్ర
దేశమంతటా ఊరేగింపు, 4న అంత్యక్రియలు
ప్రపంచ దేశాధినేతల సంతాపాలు

హవానా, నవంబర్ 26: అమెరికా సామ్రాజ్యవాదాన్ని అర్ధశతాబ్ది పాటు గడగడలాడించిన విప్లవ యోధుడు, రెపరెపలాడే ఎర్ర జెండాకు నిలువెత్తు ప్రతిరూపం, ప్రపంచంలోని అనేక విప్లవోద్యమాలకు మార్గదర్శి, క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో (90) శుక్రవారం రాత్రి కన్నుమూశారు. అమెరికాకు పక్కలో బల్లెంలామారి, సోవియట్ యూనియన్ కమ్యూనిజాన్ని అందిపుచ్చుకుని అగ్రరాజ్యంపై దాదాపు అసంభవమని భావించే తిరుగులేని విజయాన్ని సాధించిన నేత ఫిడెల్ క్యాస్టో. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న క్యాస్టో శుక్రవారం రాత్రి 10.29గంటలకు మరణించినట్లు సోదరుడు, క్యూబా అధ్యక్షుడు రౌల్ క్యాస్ట్రో రేడియో ద్వారా ప్రకటించారు. అమెరికా రాష్ట్రం ఫ్లోరిడాకు కేవలం 90మైళ్ల దూరంలో ఉన్న ద్వీపదేశం క్యూబాలో 1959 అప్పటి నియంత ఫుల్జెన్సియో బత్సితాపై తిరుగుబాటు చేసి అధికారాన్ని సాధించుకున్న క్యాస్ట్రో పది మంది అమెరికన్ అధ్యక్షులను గడగడలాడించారు. అమెరికా అధ్యక్షులంతా క్యాస్ట్రోను హతమార్చటానికి అన్ని విధాలుగా ప్రయత్నించినవారే. 630కి పైగా హత్యాయత్నాలను ఎదుర్కొన్న క్యాస్ట్రో అస్వస్థతకు గురి కావటంతో కొద్ది సంవత్సరాలుగా బయటి ప్రపంచానికి కనిపించటంలేదు. దీంతో ఆయన చనిపోయినట్లు వదంతులు కూడా పలుమార్లు వార్తలు వచ్చాయి. క్యాస్ట్రో మృతి పట్ల వివిధ దేశాధినేతలు సంతాపం ప్రకటించారు. క్యూబాలో తొమ్మిదిరోజులు సంతాపదినాలుగా ప్రకటించారు. డిసెంబర్ 4న క్యూబాకు ఆగ్నేయంగా ఉన్న చారిత్రక నగరం సాంటిగోడిలో క్యాస్ట్రో అంత్యక్రియలు జరుగుతాయని క్యూబా ప్రభుత్వం ప్రకటించింది. ఆయన భౌతిక కాయాన్ని నాలుగు రోజుల పాటు భారీ ప్రదర్శనతో క్యూబా దేశంలోని ప్రతి నగరంలోనూ ఊరేగిస్తారు. ఆ తరువాత సాంటిగోడిలో ఘనంగా అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు.