అంతర్జాతీయం

ఇంకేమి ఆధారాలు కావాలి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, ఫిబ్రవరి 22: జైషే మొహమ్మద్ ఉగ్రవాది మసూద్ అజార్‌పై ఐరాస నిషేధానికి బలమైన ఆధారాలు కావాలంటూ చైనా చేస్తున్న డిమాండ్‌ను భారత్ తిరస్కరించింది. అజార్ పాల్పడ్డ ఉగ్రవాద కృత్యాలే అతడిపై నిషేధాన్ని విధించాలన్న డిమాండ్‌కు ఆధారాలని, వీటిని రుజువు చేయాల్సిన బాధ్యత తమది కాదని స్పష్టం చేసింది.
చైనా ఉన్నతాధికారులతో ద్వైపాక్షిక అంశాలపై చర్చించిన అనంతరం భారత విదేశాంగ కార్యదర్శి ఎస్ జైశంకర్ బుధవారం మీడియాతో మాట్లాడారు. తాను జరిపిన చర్చలు సంతృప్తికరంగా సాగాయని, కీలక అంశాలపై భారత ఆందోళనలను, ప్రాధాన్యతలను చైనా నాయకత్వానికి వివరించానని చెప్పారు. మసూద్ అజార్‌పై ఐరాస 1267కమిటీ ఆంక్షలకు సంబంధించి చైనా నాయకత్వానికి మరోసారి తమ వాదన వినిపించామన్నారు. ఒక్క భారత దేశమే కాదు ఇతర దేశాలూ వీటిని అనుసరిస్తున్నాయనీ స్పష్టం చేశామని జైశంకర్ తెలిపారు. అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా పరిగణిస్తూ ఐరాస చేసిన ప్రతిపాదనను యూకే, ఫ్రాన్స్‌లు బలపరిచిన విషయాన్ని గుర్తు చేసినట్టు వివరించారు. భారత్ నుంచి బలమైన ఆధారాలను చైనా కోరడాన్ని ప్రస్తావిస్తూ 1267 ఆంక్షల నివేదిక కింద జైషే మొహమ్మద్‌ను నిషేధించిన విషయాన్ని విస్మరించకూడదని జైశంకర్ అన్నారు. జైషేపై చర్యకు 1267 నివేదికే ఆధారమని, ఇందులో అజార్ అరాచకాల వివరాలన్నీ ఉన్నాయని చెప్పారు. అందుకే ఈ విషయంలో వివరణలు ఇచ్చుకోవాల్సిన అవసరం భారత్‌కు లేదని ఉద్ఘాటించారు.