అంతర్జాతీయం

బ్రిటన్ పార్లమెంట్‌పై దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిటన్, మార్చి 22:బ్రిటన్ పార్లమెంట్‌పై దాడికి బుధవారం విఫలయత్నం జరిగింది. వెస్ట్‌మినిస్టర్ వంతెనపై అతివేగంగా కారునడుపుకుంటూ వెస్ట్‌మినిస్టర్ ప్యాలెస్‌లోకి దూసుకొచ్చేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. కాల్పులు, కత్తిపోటు దాడి సంఘటనల్లో ఇద్దరు మరణించారు. పది మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో జరిగిన ఈ దాడిని ఉగ్రవాద ఘటనగా అధికారులు పేర్కొన్నారు.
కాల్పుల శబ్దాలు కూడా వినిపించడంతో సభ్యులు ఒక్కసారిగా నిశే్చష్టులయ్యారు. ప్యాలెస్‌లోకి ప్రవేశించేందుకు యత్నించిన ‘ఉగ్రవాది’ని భద్రతా దళాలు కాల్చిచంపాయి. పార్లమెంట్‌ను మూసివేసి అప్రమత్తత ప్రకటించారు. ప్రధాని థెరీసా మేను హడావుడిగా కారు ఎక్కించి అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. హౌస్ ఆఫ్ కామన్స్ సమావేశాలను నిలిపివేసి సభ్యులెవరూ బయటికి వెళ్లవద్దని ఆదేశించారు. ఈ సంఘటన జరిగిన కొన్ని క్షణాల్లోనే ఎమర్జెన్సీ సర్వీసు హెలికాప్టర్‌ను పార్లమెంట్ స్క్వేర్‌లో దించారు. గాయపడ్డ వారికి తక్షణ ప్రాతిపదికన చికిత్స అందించారు. దాడికి పాల్పడ్డ దుండగుడ్ని పోలీసులు కాల్చిచంపారు. సమీపంలోని వెస్ట్‌మినిస్టర్ వంతెనపై అతివేగంగా వెళుతున్న ఓ కారు ఢీకొన్న ఘటనలో అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఓ మహిళ కూడా ఉన్నట్టు వార్తా కధనాలు వెలువడ్డాయి. అతివేగంగా కారును నడుపుకుంటూ ఓ వ్యక్తి పార్లమెంట్ భవనంలోకి దూసుకొచ్చేందుకు ప్రయత్నించినట్టుగా మొదట కథనాలు వెలువడ్డాయి. కారులో ఓ కత్తితో ఉన్న వ్యక్తి పార్లమెంట్ గేటు వద్ద ఉన్న ఓ అధికారిపై దాడికి పాల్పడ్డాడని అనంతరం అతడ్ని కాల్చిచంపినట్టుగా వార్తలు వచ్చాయి. వెస్ట్ మినిస్టర్ వంతెనపై గాయపడ్డ వ్యక్తుల సంఖ్య ఎక్కువగానే ఉండవచ్చునని, వీరిలో చాలా మంది రక్తసిక్తమైన శరీరాలతో వంతెనపైనే పడి ఉన్నారనీ కూడా తెలుస్తోంది.

చిత్రం.... పార్లమెంట్ సభ్యుడు తోబియస్ ఎల్‌వుడ్‌ను రక్షిస్తున్న భద్రలా బలగాలు