అంతర్జాతీయం

అఫ్గానిస్తాన్‌లో భారత కాన్సులేట్‌పై ఉగ్రవాదుల దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాబూల్, జనవరి 3: అఫ్గానిస్తాన్ పట్టణమైన మజారీ షరీఫ్‌లోని భారత కాన్సులేట్ కేంద్రంపై ఆదివారం గుర్తు తెలియని కొంత మంది ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. రెండు పేలుళ్లు, అనంతరం జరిగిన కాల్పుల నేపథ్యంలో వీరందరూ భారత కాన్సులేట్ ప్రాంగణంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించినట్లు ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే ఈ దాడిలో ఎంతమంది గాయపడినదీ, అలాగే ఈ భవనానికి ఏదైనా నష్టం జరిగిందా అనే వివరాలు వెంటనే వెలుగులోకి రాలేదు. పఠాన్‌కోట్ వైమానిక కేంద్రంపై పాకిస్తాన్ మిలిటెంట్లు జరిగిన దాడి ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో అఫ్గాన్‌లోని భారత కాన్సులేట్‌పై ఈ దాడి జరగడం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది.