అంతర్జాతీయం

అంతా పాక్ వల్లే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా, సెప్టెంబర్ 28: ఇస్లామాబాద్‌లో జరగాల్సిన ఎనిమిది దేశాల సార్క్ సదస్సు నిర్వహణ దాదాపు అనుమానంలో పడింది. సదస్సులో భాగస్వామ్యం కావటం లేదంటూ భారత్ ప్రకటించిన కొద్ది గంటల్లోపే పాకిస్తాన్ మినహా మిగతా ఆరు దేశాలూ స్పందించాయి. బంగ్లాదేశ్, భూటాన్‌లతోసహా అన్ని సభ్య దేశాలూ పాకిస్తాన్ వైఖరినే తప్పుపట్టాయి. తాము సదస్సును బహిష్కరించటానికి పాకిస్తానే కారణమని బంగ్లాదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ‘‘సార్క్ దేశాల సదస్సులో పాలు పంచుకోరాదని బంగ్లాదేశ్ నిర్ణయించటానికి ఒక సార్క్ సభ్యదేశం పదే పదే మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటమే కారణం’’ అని బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి షాహ్రియార్ ఆలమ్ పరోక్షంగా పాకిస్తాన్‌ను తప్పు పట్టారు. సానుకూల వాతావరణం ఏర్పడితే అప్పుడు సార్క్ సదస్సులో పాల్గొంటామంటూ సదస్సుకు నేతృత్వం వహిస్తున్న నేపాల్‌కు లేఖ రాసినట్లు పేర్కొన్నారు. అయితే సార్క్ సభ్య దేశంగా బంగ్లాదేశ్ దాని స్ఫూర్తికి, ప్రాంతీయ సహకారానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. గత కొద్ది నెలలుగా 1971నాటి బంగ్లాదేశ్ యుద్ధ నేరస్థులు పాకిస్తాన్ సైన్యం అండతో అరాచకాలు సృష్టిస్తున్నారని ఆయన అన్నారు. తాము తమ దేశ స్వాతంత్య్రం, సార్వభౌమాధికారాల విషయంలో ఎలాంటి రాజీపడే ప్రశే్నలేదని స్పష్టం చేశారు. ఇది పూర్తిగా తమ సొంత నిర్ణయమని ఆయన అన్నారు. ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు మహమ్మద్ అష్రాఫ్ ఘనీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ సార్క్‌కు నేతృత్వం వహిస్తున్న నేపాల్‌కు లేఖ రాశారు. ఆఫ్ఘనిస్తాన్‌పై ఉగ్రవాద దాడులు రోజురోజుకూ పెరుగుతున్న కారణంగా కమాండర్ ఇన్ చీఫ్‌గా బాధ్యతల ఒత్తిడి ఉండటంతో సార్క్ సదస్సుకు హాజరు కావటం లేదని స్పష్టం చేశారు. భూటాన్ రాచరిక ప్రభుత్వం సైతం ఈ ప్రాంతంలో శాంతిసామరస్యాలకు ఉగ్రవాదం విఘాతం కలిగిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో సార్క్ సదస్సుకు హాజరు కాలేనని స్పష్టం చేసింది. సార్క్ చార్టర్ ప్రకారం ఎనిమిది సభ్యదేశాల్లో ఒక్కదేశం హాజరుకాకపోయినా సదస్సు నిర్వహించటం కుదరదు. భారత్‌తోపాటు మరో మూడు సభ్యదేశాలు కూడా తిరస్కరించటంతో సదస్సు రద్దు అనివార్యమైపోయింది.