అంతర్జాతీయం

కుదరని అంగీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, సెప్టెంబర్ 16: సింధూ నదీ జలాల ఒప్పందంపై భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన చర్చలు ఎలాంటి అంగీకారం లేకుండానే అర్ధ్ధాంతరంగా ముగిసినట్లు ప్రపంచ బ్యాంక్ తెలిపింది. ఈ ఒప్పందానికి సంబంధించిన సమస్యలను సామరస్య పూర్వకంగా పరిష్కరించడానికి తాము నిష్పక్షపాతంగా ప్రయత్నించడం కొనసాగిస్తామని కూడా ప్రపంచ బ్యాంక్ స్పష్టం చేసింది. జమ్మూ, కాశ్మీర్‌లో సింధూనది ఉపనదులపై నిర్మిస్తున్న రట్లే, కిషన్‌గంగ జల విద్యుత్ ప్రాజెక్టులపై పాకిస్తాన్ అభ్యంతరాలు లేవనెత్తిన విషయం తెలిసిందే. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఆ దేశం ప్రపంచ బ్యాంక్‌ను కోరింది. ఈ అంశంపై ఇంతకుముందు రెండు దేశాల మధ్య చర్చలు జరిగాయి. కాగా, మరోసారి ఈ నెల 14, 15 తేదీల్లో వాషింగ్టన్‌లోని ప్రపంచ బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో చర్చలు జరిగాయి. అయితే ఈ సమావేశాల్లో ఎలాంటి అంగీకారం కుదరకపోయినప్పటికీ ఒప్పందంలోని నిబంధనలకు అనుగుణంగా సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించడానికి రెండు దేశాలతో కలిసి పనిచేయడాన్ని కొనసాగిస్తామని ఇరు దేశాల సెక్రటరీ స్థాయి చర్చల అనంతరం ప్రపంచ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇరు దేశాలు, ప్రపంచ బ్యాంక్ ఈ చర్చలను స్వాగతించాయని, ఒప్పందాన్ని పరిరక్షించడానికి తమ కృతనిశ్చయాన్ని పునరుద్ఘాటించాయని ఆ ప్రకటన తెలిపింది. ప్రపంచ బ్యాంక్ సహకారంతో దాదాపు 9 సంవత్సరాలపాటు భారత్, పాకిస్తాన్‌ల మధ్య 1960లో సింధూ నదీ జలాల ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంపై ఇరు దేశాలతోపాటుగా ప్రపంచ బ్యాంక్ కూడా సంతకం చేసింది. కాగా, తాజాగా జరిగిన చర్చల్లో భారత్ ప్రతినిధి బృందానికి కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి అమర్‌జిత్ సింగ్ నాయకత్వం వహించారు. సింధూ జలాల భారత కమిషనర్, విదేశీ వ్యవహారాలు, విద్యుత్, కేంద్ర జలసంఘం ప్రతినిధులు కూడా ఈ బృందంలో ఉన్నారు. పాకిస్తాన్ ప్రతినిధి బృందానికి ఆ దేశ జలవనరుల విభాగం కార్యదర్శి ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ నేతృత్వం వహించగా జలవనరులు, విద్యుత్ శాఖ కార్యదర్శి యూసుఫ్ నసీమ్ ఖోకర్, సింధూ జలాల ఒప్పందం హైకమిషనర్ మీర్జా ఆసిఫ్ బేగ్, జలవనరుల సంయుక్త కార్యదర్శి సయ్యద్ మెహర్‌షా సభ్యులుగా ఉన్నారు. కాగా, గత ఆగస్టు 1న ఇరు దేశాల మధ్య తొలి విడత చర్చలు జరిగాయి.