అంతర్జాతీయం

ఆర్థిక ప్రగతే ప్రధాన అజెండా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దోహా, జూన్ 4: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఖతార్‌లో పర్యటిస్తున్న క్రమంలో ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాల ప్రగతిని ఇరు దేశాలు ఆశిస్తున్నాయి. భారత అభివృద్ధిలో భాగస్వాములు కావాలంటూ విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో భాగంగా శనివారం ఇక్కడకు చేరుకున్న మోదీ.. ఆదివారం ఖతార్ అధినాయకత్వంతో చర్చలు జరపనున్నారు. ముఖ్యంగా హైడ్రోకార్బన్ రంగంలో ఖతార్ సాయాన్ని మోదీ కోరనున్నారు. గత ఆర్థిక సంవత్సరం (2015-16) భారత ఎల్‌ఎన్‌జి అవసరాల్లో 65 శాతం ఖతార్ ద్వారానే తీరాయి. ఈ నేపథ్యంలో ఖతార్ ఎమిర్.. షేక్ తమిమ్ బిన్ హమద్ అల్-తహనితో నిర్వహించే చర్చల్లో ఎనర్జీ రంగంపై మోదీ ప్రధాన దృష్టిని పెట్టనున్నారు. అలాగే ఇరు దేశాలకు సంబంధించిన ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలూ ప్రస్తావనకు రానున్నాయి.
ఇకపోతే ఈ పర్యటనలో ఖతార్ వ్యాపార, పారిశ్రామికవేత్తలతోనూ ఆదివారం ఉదయం మోదీ సమావేశం అవుతున్నారు. ఈ సందర్భంగా వారి నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆహ్వానించనున్న మోదీ.. వౌలికరంగంలో పెట్టుబడులకున్న విశేష అవకాశాలను వారికి వివరిస్తారు. కాగా, ఈ పర్యటనలో ఖతార్‌తో భారత్ పలు ఒప్పందాలను కుదుర్చుకోనుంది. భారత ముడి చమురు అవసరాలను తీరుస్తున్న గల్ఫ్ దేశాల్లో ఖతార్ ముందుండగా, 2014-15 ఆర్థిక సంవత్సరంలో భారత్-ఖతార్ ద్వైపాక్షిక వాణిజ్యం విలువ 15 బిలియన్ డాలర్లుగా ఉంది. దీన్ని మున్ముందు మరింత పెంచాలని ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయ.
శనివారం దోహాకు చేరుకున్న మోదీ