అంతర్జాతీయం

అణు పరీక్షలు ఆపకుంటే.. ఇక ‘్ధ్వంసమే’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, సెప్టెంబర్ 17:అణు పరీక్షలు ఆపకపోతే ఉత్తర కొరియాను ‘్ధ్వంసం’చేస్తామని అమెరికా తీవ్ర స్వరంతో హెచ్చరించింది. త్వరలో విస్తృ స్థాయిలో దౌత్యపరమైన ప్రయత్నాలు జరుగనున్న తరుణంలో ఉత్తర కొరియాపై అమెరికా మరింత వత్తిడి పెంచింది. అంతర్జాతీయ ఆంక్షలు, హెచ్చరికల్ని ఉల్లంఘించి బాధ్యతారహితంగా అణు, బాలిస్టిక్ క్షిపణి జరిపితే ఇక ఎంత మాత్రం సహించేది లేదని ట్రంప్ ప్రభుత్వం తెగేసి చెప్పింది. గత కొన్ని వారాలుగా బరితెగిస్తున్న ఉత్తర కొరియాను దారికి తెచ్చే అంశంపై అమెరికాతో పాటు పలు దేశాలు దౌత్య పరమైన ప్రయత్నాలు ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. మంగళవారం ఐరాస జనరల్ అసెంబ్లీనుద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడనున్నారు. ఉత్తరకొరియా అంశంపై గురువారం జపాన్, దక్షిణ కొరియా నేతలతో సమావేశమవుతారు. శనివారం దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌జాయిన్‌తో ట్రంప్ ఫోన్‌లో మాట్లాడారు. ఇంకెంత మాత్రం రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా అది తన పతనానికే దారితీస్తుందన్న వాస్తవాన్ని ఉత్తర కొరియాకు తెలిసేలా చేసే దిశగా దౌత్య ప్రయత్నాలు పదునెక్కుతున్నాయి.