అంతర్జాతీయం

దెబ్బతింటున్న దేశ ప్రతిష్ఠ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, సెప్టెంబర్ 21: ప్రపంచ వ్యాప్తంగా శాంతి, సామరస్యాలు విలసిల్లే దేశంగా భారత్‌కు ఉన్న పేరు ప్రతిష్ఠలు.. ప్రస్తుతం దేశ ప్రజలను విభజిస్తున్న విచ్ఛిన్న శక్తుల వల్ల దెబ్బతింటున్నాయని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. రెండు వారాల పర్యటన కోసం అమెరికాకు వచ్చిన 47 ఏళ్ల రాహుల్ గాంధీ గురువారం ఇక్కడ ప్రఖ్యాతి గాంచిన టైమ్స్ స్క్వేర్ సమీపంలోని ఒక హోటల్‌లో సుమారు రెండు వేల మంది మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ అమెరికాలోని మేధావులు, విద్యార్థులు, రాజకీయ నాయకులు, విద్యావేత్తలతో ఇష్టాగోష్టిగానూ మాట్లాడుతూ భవిష్యత్ భారతం గురించి తన దృక్పథంపై చర్చించారు. ప్రవాస భారతీయులను ఉద్దేశించి చేసిన తన ప్రసంగంలో ‘్భరత్ ఎల్లవేళలా సామరస్యంగా ఎలా జీవించాలనే దానిని ప్రపంచానికి చాటి చెప్పింది.
వేలాది సంవత్సరాల తరబడి శాంతి సామరస్యాలు గల దేశంగా భారత్‌కు ప్రపంచ వ్యాప్తంగా పేరుంది. అయితే దీనికి ఇప్పుడు సవాలు ఎదురవుతోంది’ అని రాహుల్ గాంధీ అన్నారు. ‘ఇప్పుడు జాతిని విభజించే విచ్ఛిన్న శక్తులు దేశంలో ఉన్నాయి. ఆ శక్తులు మన దేశ పేరు ప్రఖ్యాతులను నాశనం చేస్తున్నాయి’ అని ఆయన మండిపడ్డారు. తన రెండు వారాల పర్యటనలో తాను అమెరికాలోని డెమొక్రటిక్, రిపబ్లికన్ పార్టీలకు చెందిన అనేక మందితో చర్చలు జరిపానని, అయితే వారంతా ప్రస్తుతం భారత్‌లో ఏం జరుగుతోందని ప్రశ్నించారని రాహుల్ గాంధీ చెప్పారు. ప్రపంచ దేశాలలో భారత్‌కు ఉన్న పేరు ప్రఖ్యాతులు ఎంతో ముఖ్యమని ఆయన నొక్కి చెబుతూ ప్రపంచం పరివర్తన చెందుతోందని, ప్రపంచ ప్రజలు భారత్ వైపు చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ‘హింసాత్మక ప్రపంచంలో అనేక దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి. 21వ శతాబ్దానికి భారతే ఒక సమాధానం కావొచ్చు. 21వ శతాబ్దంలో శాంతి, సహజీవనానికి భారతదేశమే ఒక సమాధానంగా నిలవొచ్చు. అందువల్ల ఎంతో శక్తివంతమైన మన ఆస్తిని మనం పోగొట్టుకోవడాన్ని భరించజాలం’ అని రాహుల్ గాంధీ అన్నారు.
భారత్‌కు అత్యంత శక్తివంతమైన ఆస్తి దేశంలో సంతోషంగా, శాంతియుతంగా, అహింసాత్మకంగా జీవిస్తున్న 1.3 బిలియన్ మంది ప్రజలేనని ఆయన అన్నారు. అందువల్లనే ప్రపంచం మన దేశాన్ని గౌరవిస్తోందని ఆయన పేర్కొన్నారు.

చిత్రం..న్యూయార్క్‌లో ప్రవాస భారతీయుల సదస్సులో మాట్లాడుతున్న రాహుల్ గాంధీ