అంతర్జాతీయం

నువ్వే పిచ్చోడివి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సియోల్, సెప్టెంబర్ 22: ‘అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మానసిక పరిస్థితి బాగోలేదు. మా దేశాన్ని నాశనం చేస్తానంటున్న ఆయన హెచ్చరికలకు బెదిరేవాళ్లు ఎవ్వరూ లేరు. అలాంటి ఆలోచనలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు’ అంటూ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్-ఉన్ శుక్రవారం క్షిపణుల్లాంటి మాటలు వదిలారు. ఉత్తర కొరియా అణు పరీక్షలు, క్షిపణి ప్రయోగాలపై అటు అమెరికా, ఇటు యుఎన్ ఏకబిగిన చేస్తున్న హెచ్చరికలను లెక్కచేయకుండా ఘాటైన సమాధానమిస్తున్న కిమ్, శుక్రవారం మరింత రెచ్చగొట్టే వ్యాఖ్యలకు దిగారు. గతంలోనే ‘ట్రంప్ ఓ పిచ్చోడు’ అంటూ వ్యాఖ్యానించిన కిమ్, ట్రంప్ మానసిక స్థితిపై మరోసారి చేసిన వ్యాఖ్యలు మరింత రెచ్చగొట్టేవిగానే ఉన్నాయి. ఫసిఫిక్ మహా సముద్రంపై హైడ్రోజన్ బాంబు వేసే ప్రమాదం లేకపోలేదంటూ ఉత్తర కొరియా విదేశాంగ మంత్రి హెచ్చరికలు చేసి 24 గంటలు తిరగకముందే, ఆ దేశ అధ్యక్షుడు కిమ్ మరింత దూకుడుతో ట్రంప్‌పై వ్యాఖ్యలు చేయడం యుద్ధం తప్పదన్న పరిస్థితిని సూచిస్తోంది. ఇదిలావుంటే, ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశంలో ‘రాకెట్ మ్యాన్ కారణంగా ఉత్తర కొరియాకు వినాశనం తప్పదంటూ’ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు కిమ్ ఇచ్చిన సమాధానంగానూ దీన్ని పరిగణిస్తున్నారు. ‘ప్రపంచ దేశాల ముందు నన్ను, నా దేశాన్ని ట్రంప్ అవమానించారు. చరిత్రలో యుద్ధోన్మాద దేశంగా ఉత్తర కొరియాను చిత్రీకరించే కుట్రలు చేస్తున్నారు’ అంటూ కిమ్ వ్యాఖ్యానించినట్టు ఉత్తర కొరియా అధికారిక మీడియా స్పష్టం చేసింది. ‘ప్రపంచానికి పెద్దన్న ధోరణిలో అమెరికా చేసే పెత్తనానికి బెదిరేవాళ్లెవ్వరూ లేరు. ఆయన హెచ్చరికలకు గట్టిగా బదులిస్తాం’ అని కిమ్ వ్యాఖ్యానించినట్టు అధికారిక మీడియా పేర్కొంది.