అంతర్జాతీయం

ఐరాసలో భారత్ పాత్రకు గుటెరెస్ ప్రశంసలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్య సమితి, సెప్టెంబర్ 24: స్థిరమైన అభివృద్ధి, శాంతి పరిరక్షణ చర్యలు, పర్యావరణ మార్పులను ఎదుర్కొనేందుకు ఐక్యరాజ్య సమితి చేస్తున్న కృషిలో భారత్ పాత్రను ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ ప్రశంసించారు. శనివారం ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ప్రసంగించిన తర్వాత గుటెరెస్‌తో ఆమెతో భేటీ అయిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో సుష్మాస్వరాజ్‌తో వెంట విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజె అక్బర్, విదేశాంగ శాఖ కార్యదర్శి ఎస్ జైశంకర్, ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ కూడా ఉన్నారు. పర్యావరణ పరిరక్షణ, శాంతిరక్షక కార్యకలాపాలు, స్థిరమైన అభివృద్ధికి సంబంధించి ఐరాస కృషిలో భారత్ పాత్రను ప్రధాన కార్యదర్శి ప్రశంసించారని సమావేశంపై గుటెర్రెస్ కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటన పేర్కొంది.