అంతర్జాతీయం

బ్రిటన్ రచయితకు సాహిత్యంలో నోబెల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టాక్‌హోమ్, అక్టోబర్ 5: భౌతిక ప్రపంచంతో మనిషి భావోద్వేగ సంబంధాల లోతులను ఆవిష్కరించి, భ్రమలను తొలగించిన ప్రఖ్యాత బ్రిటిష్ రచయిత కజువో ఇషిగ్గురోకు సాహిత్యంలో నోబెల్ బహుమతి లభించింది. ‘ది రిమెయిన్స్ ఆఫ్ ది డే’ నవలతో ప్రపంచ సాహితీ ప్రియులను విశేషంగా ఆకర్షించిన 62 సంవత్సరాల ఇషిగ్గురోకు ఇప్పటికే బుకర్ ప్రైజ్ లభించింది. ఎనిమిది విశేష ఆదరణ పొందిన పుస్తకాలను రచించిన ఆయన టెలివిజన్ స్క్రిప్టులను సైతం రూపొందించారు. ఇషిగ్గురో సాహితీ ప్రపంచానికి చేసిన వినూత్న సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందజేస్తున్నట్లు నోబెల్ అకాడమీ తెలిపింది. జపాన్‌లోని నాగసాకిలో జన్మించిన ఆయన తన ఐదేళ్ల ప్రాయంలోనే కుటుంబ సభ్యులతో బ్రిటన్‌కు వెళ్లిపోయారు. 1982లో ‘ఎ పేల్ వ్యూ ఆఫ్ హిల్స్’ నవలతో ప్రపంచ సాహితీ ప్రియులకు పరిచయమైన ఆయన రెండవ ప్రపంచ యుద్ధానంతరం నాగసాకిలో నెలకొన్న పరిస్థితులను కళ్లకు కడుతూ 1986లో ‘ఎన్ ఆర్టిస్ట్ ఆఫ్ ది ఫ్లోటింగ్ వరల్డ్’ అనే నవలను రచించారు. ఇషిగ్గురో ఎంపిక చేసుకున్న ఇతివృత్తాలన్నీ వర్తమాన, సమకాలీన ప్రపంచంతో ముడిపడి ఉన్నవేనని నోబెల్ అకాడమీ తెలిపింది.