అంతర్జాతీయం

ఐరాసను సంస్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, అక్టోబర్ 6: ఆధునిక ప్రపంచ అవసరాలకు అనుగుణంగా ఐక్యరాజ్య సమితి (ఐరాస) అనుబంధ సంస్థలను సంస్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని భారత్ మరోసారి స్పష్టం చేసింది. ముఖ్యంగా ఐరాస భద్రతామండలి సంస్కరణ, విస్తరణకు సంబంధించి మరింత బలంగా తమ వాదనను వినిపించిన భారత్‌‘ఈ వ్యవస్థలన్నీ కూడా కేవలం కొన్ని దేశాల ప్రయోజనానాలను దృష్టిలోపెట్టుకుని నాటి అవసరాల కోసం ఏర్పడినవే’అని స్పష్టం చేసింది. ఐరాసను తక్షణ ప్రాతిపదికన అంతర్జాతీయ అసరాల మేరకు తీర్చిదిద్దాలని భారత్ శాశ్వత మిషన్ తొలి కార్యదర్శి ఎడియా ఉమాశంకర్ సూచించారు. ఐరాస జనరల్ అసెంబ్లీ కమిటీలో మాట్లాడిన ఆయన అంతర్జాతీయ సంస్థలు వర్తమాన వాస్తవాలను ప్రతిబింబించేవిగా ఉండాలంటే బహుళ జాతీయ దృక్పథం, నియమ, నిబంధనలు అవసరమని స్పష్టం చేశారు. ఈ అంతర్జాతీయ సంస్థలు ఆధునిక కాలంలోనూ చెల్లుబాటు కావాలంటే వౌలికంగా వాస్తవిక మార్పులు జరగాలని ముఖ్యంగా భద్రతామండలిని సంస్కరించాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చట్టపాలన అన్న అంశంపై ఆయన మాట్లాడారు. భద్రతామండలిని విస్తరించాలని భారత్, జపాన్, జర్మనీ, బ్రెజిల్‌లు దీర్ఘకాలంగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. చట్టాలన్నవి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పరివర్తన చెందుతూ ఉండాలని పేర్కొన్న ఉమాశంకర్‌‘మార్పుల కారణంగా ఎన్నో పాత చట్టాలు, నియంత్రణలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి.
ఏడు దశాబ్దాల నాటి భారత రాజ్యాంగంలోనూ వందకు పైగా సవరణలు చేశాం’అని తెలిపారు. కేవలం కొన్ని దేశాలు తమ ప్రయోజనాలను పరిరక్షించుకోవడం కోసం ఐరాస వ్యవస్థలకు రూపకల్పన చేశాయని పేర్కొన్న ఆయన ప్రపంచ వ్యాప్తంగా వెర్రితలలు వేస్తున్న ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు అంతర్జాతీయంగా ఉమ్మడి ప్రయత్నం జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. అయితే ఇందుకు సంబంధించి అంతర్జాతీయ చట్ట రూపకల్పనలో భౌగోళిక, రాజకీయ, సంకుచిత ప్రయోజనాలు ప్రతిబంధకంగా మారుతున్నాయని చెప్పారు. ఈ కీలకమైన అంశంపై పూర్తి స్థాయిల సహకారం అందించకుండా చాలా దేశాలు భిన్న సందర్భాల్లో రూపొందించిన చట్ట భావనల ముసుగు వేసుకుంటున్నాయని ఉమాశంకర్ తెలిపారు.
ఇందుకు సంబంధించి అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర ఒడంబడికి ముసాయిదా విషయంలో తలెత్తుతున్న పరిస్థితుల గురించి ప్రస్తావించారు. ఈ అంశాన్ని ఇప్పటి వరకూ భద్రతామండలి కమిటీలో కూడా సంతృప్తికరంగా పరిశీలించే ప్రయత్నం జరగలేదని అన్నారు.