అంతర్జాతీయం

అగ్రరాజ్యంపైనే గురి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాంగ్యాంగ్, అక్టోబర్ 7: అగ్రరాజ్యం ఎన్ని బెదిరింపులకు దిగినప్పటికీ వెనక్కి తగ్గని ఉత్తర కొరియా, ఇప్పుడు ఏకంగా అమెరికాపైకే లాంగ్ రేంజ్ క్షిపణిని ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. ఈ క్షిపణి అమెరికా పశ్చిమ తీరాన్ని తాకగలదని భావిస్తున్నట్లు రష్యా పార్లమెంట్ సభ్యుడు ఆంటోన్ మొరొజోవ్ తెలిపారు. ఇదిలావుంటే, ఉత్తర కొరియా దీర్ఘ శ్రేణి క్షిపణి పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్న విషయాన్ని అమెరికా నిఘా వర్గాలు కూడా ధ్రువీకరించాయి. ఈ నెల 10న కొరియన్ వర్కర్స్ పార్టీ వార్షికోత్సవాన్ని జరుపుకోనుంది. కనుక కొరియా అదే రోజు బలప్రదర్శనకు దిగవచ్చని భావిస్తున్న నిఘా వర్గాలు సిఐఎలోని కొరియన్ మిషన్ సెంటర్ సిబ్బందిని అప్రమత్తం చేసింది.