అంతర్జాతీయం

సాయుధ హింసకు బాల్యం బలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్య సమితి, అక్టోబర్ 7: భారత్‌లో వేర్పాటువాదులు, నక్సలైట్లు బాలలను తమలో చేర్చుకుంటుండటం పట్ల ఐక్యరాజ్య సమితి (ఐరాస) సెక్రెటరి జనరల్ ఆంటోనియో గుటెరిస్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల సాయుధ గ్రూపులకు, ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న హింసాత్మక ఘటనల్లో బాలలు నలిగిపోతున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేకంగా జమ్మూకాశ్మీర్, చత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లలో ఈ పరిస్థితి ఉందని ఆయన తెలిపారు. ‘సాయుధ పోరులో పిల్లలు’ అనే అంశంపై రూపొందించిన తన వార్షిక నివేదికలో గుటెరిస్ ఈ మూడు రాష్ట్రాల్లో పిల్లల స్థితిగతులపై చర్చించారు. సాయుధ గ్రూపులు బాలలను చేర్చుకుంటున్నాయని ఐరాసకు సమాచారం అందుతోందని, ముఖ్యంగా చత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలలో నక్సలైట్లు పిల్లలను తమలో చేర్చుకుంటున్నారని గుటెరిస్ పేర్కొన్నారు. దీనివల్ల నక్సలైట్ సాయుధ గ్రూపులకు, ప్రభుత్వ బలగాలకు మధ్య హింసాత్మక సంఘనలు తలెత్తినప్పుడు బాలలు బలవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జమ్మూకాశ్మీర్‌లో ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు బాలలు ఎలా నలిగి పోతున్నారో చత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లలోనూ పిల్లలు నలిగిపోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ సమాచారం ప్రకారం, జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు కనీసం 30 పాఠశాలలను దగ్ధం చేయడమో, పాక్షికంగా ధ్వంసం చేయడమో జరిగిందని గుటెరిస్ తెలిపారు. దీంతోపాటు భద్రతా బలగాలు జమ్మూకాశ్మీర్‌లోని నాలుగు పాఠశాలలను కొన్ని వారాల పాటు తమ ఆధీనంలో ఉంచుకున్నట్టు ప్రభుత్వ నివేదికలు ధ్రువీకరించాయని ఆయన పేర్కొన్నారు. చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు అనేక పాఠశాలలను నడుపుతున్నారని, ఆ పాఠశాలల్లో పాఠ్యాంశాల్లో భాగంగా సాయుధ పోరాటం గురించి బోధిస్తున్నారనేది ఆందోళన కలిగించే అంశమని గుటెరిస్ తన నివేదికలో పేర్కొన్నారు. సాయుధ గ్రూపులు బాలలను తమలో చేర్చుకొని, వివిధ రకాలుగా ఉపయోగించుకుంటున్నాయనే వార్తలను ఐరాస ప్రత్యక్షంగా ధ్రువీకరించుకునే అవకాశం లేదని ఆయన పేర్కొన్నారు. మావోయిస్టుల్లో చేరిన పిల్లలు సాయుధ శిక్షణ తీసుకుంటున్నారని, వారికి కొరియర్లుగా, ఇన్‌ఫార్మర్లుగా, బాలల దళాల్లో గార్డులుగా పని చేస్తున్నారనే సమాచారం ఐరాసకు అందిందని గుటెరిస్ పేర్కొన్నారు. గతంలో మావోయిస్టులతో కలిసి పనిచేసిన పిల్లలను పోలీసులు కూడా నక్సలైట్ల సమాచారాన్ని సేకరించడానికి ఉపయోగించుకుంటున్నారని ధ్రువపడని సమాచారం ఐరాసకు అందిందని ఆయన తన నివేదికలో వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా 2016లో జరిగిన వివిధ సాయుధ ఘర్షణల్లో ఎనిమిది వేలకు పైగా మంది పిల్లలు చనిపోవడమో, వికలాంగులుగా మారడమో జరిగిందని గుటెరిస్ తెలిపారు.