అంతర్జాతీయం

జాదవ్ కేసులో ఐసిజెకు పాక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, అక్టోబర్ 7: భారత నౌకాదళ మాజీ ఉద్యోగి కుల్‌భూషణ్ జాదవ్ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసిజె)లో పిటిషన్ దాఖలు చేయడానికి పాకిస్తాన్ ప్రయత్నాలు ప్రారంభించింది. గూఢచర్యం నేరంపై 46 ఏళ్ల జాదవ్‌కు పాకిస్తాన్ సైనిక కోర్టు మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. 2016 మార్చిలో బలోచిస్తాన్‌లో జాదవ్‌ను పాకిస్తాన్ భద్రతాదళాలు పట్టుకున్నాయి. గూఢచర్యం, ప్రభుత్వాన్ని కూలదోయడానికి అతడు ప్రయత్నించాడన్నది పాకిస్తాన్ అభియోగం. రెండు పాస్‌పోర్టులు సంపాదించిన కుల్‌భూషణ్ కుట్రపూరితంగా వ్యవహరించాడని పాకిస్తాన్ సైనిక కోర్టు నిర్ధారించి మరణశిక్ష విధించింది. అయితే దీనిపై భారత్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించి విజయం సాధించింది. జాదవ్ ఉరి అమలుకాకుండా ఐసిజె తాత్కాలిక ఉత్తర్వులు ఇచ్చింది. జాదవ్‌పై నేరారోపణలకు సంబంధించి లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని అంతర్జాతీయ న్యాయస్థానం పాకిస్తాన్‌ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో అటార్నీ జనరల్ అష్తర్ అసాఫ్ అలీ అధ్యక్షతన ఓ సమావేశం జరిగిందని విదేశాంగ శాఖ వెల్లడించింది. న్యాయనిపుణులు, విదేశాంగ శాఖ ఉన్నతాధికారులు సమావేశానికి హాజరై ఐసిజెలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. భారత్ ఆరోపణలను న్యాయపరంగానే తిప్పికొట్టాలని, దీనిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉండాలని సమావేశంలో నిర్ణయించినట్టు అటార్నీ జనరల్ అలీ ‘డాన్’కు వివరించారు.