అంతర్జాతీయం

కొత్త శకానికి నాంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 9: భారత్-అమెరికా సహజ మిత్రులని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న మైత్రి ఉన్నత శిఖరాలకు చేరిందని ఆయన వెల్లడించారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక, వ్యాపార, వాణిజ్య సంబంధాలు ప్రభావవంతమైనవని ఆయన స్పష్టం చేశారు. యుఎస్ కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో బుధవారం రాత్రి ఆయన ప్రసంగించారు. భారత్-అమెరికాల సంబంధాల్లో కొత్తశకం ప్రారంభమైందని ఆయన తెలిపారు. ఇరుదేశాల ప్రయోజనాలు కాపాడుకోవడంతోపాటు ప్రపంచానికే ఆదర్శంగా మారిందని ఆయన అన్నారు. వాతావరణ మార్పు, ఉగ్రవాదం, పేదరికం, ఆరోగ్య భద్రత వంటి అంశాల్లో ఉభయ దేశాలు పరస్పర సహకారంతో ముందుకు సాగుతున్నట్టు భారత ప్రధాని వెల్లడించారు. తన రెండు రోజుల పర్యటన ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక బంధం మరింత బలోపేతం కావడానికి దోహదపడుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తంచేశారు. అమెరికా ప్రజాప్రతినిధులు, ఎంపిక చేసిన ఇండో అమెరికన్లు హాజరైన ఈ సమావేశంలో మాట్లాడే అరుదైన అవకాశం తనకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. అయితే ఇది వ్యక్తిగతంగా తనకు లభించిన గౌరవం కాదని, ఆ గౌరవం తన భారత్‌కేనని ఆయన ఉద్ఘాటించారు. రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు దశాబ్దకాలంలో పది మిలియన్ డాలర్లకు చేరాయని ప్రధాని స్పష్టం చేశారు. భారతీయ నాగరిత, సంస్కృతి ఎంతో పురాతనమైందన్న మోదీ ‘్భరతీయ యోగాను 30 మిలియన్ల మంది అమెరికన్లు అభ్యసిస్తున్నారు’ అని అన్నారు.