అంతర్జాతీయం

సిరియాపై రష్యా వైమానిక దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్కో, అక్టోబర్ 7: సిరియాలో భారీఎత్తున వైమానిక దాడులు జరిపిన రష్యా 180 మంది ఐఎస్ మిలిటెంట్లను మట్టుబెట్టింది. 24 గంటల్లో మొత్తం 120 మంది ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్లు, 60 మంది విదేశీ కిరాయి సైనికులను హతం చేసినట్టు రష్యా రక్షణ మంత్రిత్వశాఖ శనివారం మాస్కోలో ప్రకటించింది. అయితే ఒమర్ అల్ షిషానీతోపాటు ముగ్గురు సీనియర్ ఐఎస్ కమాండర్లను వైమానిక దాడుల్లో చంపేశామని రష్యా చెప్పుకొచ్చింది. మయాదీన్‌లో ఉగ్రవాద స్థావరంపై దాడి చేసి 80 మంది ఐఎస్ మిలిటెంట్లను చంపేశాం. అందులో తొమ్మిది మంది ఉత్తర కాకసస్‌కు చెందిన వారున్నారు’ అని రక్షణశాఖ వెల్లడించింది. అల్బు కమాల్ పట్టణంలో మరో 40 మంది మిలిటెంట్లను హతం చేసినట్టు పేర్కొన్నారు. సిరియాలో మయాదీన్ ఐఎస్ మిలిటెంట్లకు పెట్టని కోట. ఇక్కడినుంచే ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తుండేది. మరో వైమానిక దాడిలో 60 మంది విదేశీ కిరాయి సైనికులు మృతి చెందారని రష్యా తెలిపింది. పూర్వం సోవియట్ యూనియన్‌లో ఉన్న టునీషియా, ఈజిప్టు నుంచి వచ్చి యుఫారేట్స్ లోయలో ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్నట్టు వివరించారు. ఇరాక్ నుంచి సిరియా సరిహద్దు పట్టణం అల్బు కమాల్ వచ్చి ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్టు రష్యా స్పష్టం చేసింది. అలాగే సీనియర్ ఐఎస్ కమాండర్లు ఒమర్ అల్ షిషానీ, అలా అలాడిన్ అల్ షిషానీ, సలా అల్ దిన్ షిషానీలను హతం చేసినట్టు మాస్కో ప్రకటించింది. ఈ ముగ్గురు సీనియర్ కమాండర్లు నార్తరన్ కాకసస్‌కు చెందినవారు.