అంతర్జాతీయం

అభియోగాలు నమోదు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, అక్టోబర్ 9: పనామా పేపర్ల కేసులో పదవి కోల్పోయిన మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోమవారం కోర్టు వాయిదాకు గైర్హాజరయ్యారు. ఆయనపై 13న అభియోగాలు నమోదుచేయాలని కోర్టు ఆదేశించింది. మరోపక్క షరీఫ్ కుమార్తె మరియం నవాజ్ (43), ఆమె భర్త మహ్మద్ సఫ్దర్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరియం, ఆమె భర్త మాజీ ఆర్మీ కెప్టెన్‌లపై పనామా పేపర్ల కుంభకోణం ఆరోపణలున్నాయి. కోర్టుకు హాజరుకావడానికి ఆదివారం రాత్రి మరియం, సఫ్దర్‌లు లండన్ నుంచి ఇస్లామాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే సఫ్దర్‌పై నాన్‌బెయిలబుల్ అరెస్టు వారెంట్ ఉండడంతో విమానాశ్రయంలో దిగగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భార్యాభర్తలు ఇద్దరిని విడివిడిగా న్యాయమూర్తి మహ్మద్ బషీర్ ఎదుట హాజరుపరిచారు.