అంతర్జాతీయం

ఇలాగైతే లైసెన్సులు రద్దే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, అక్టోబర్ 12: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేశంలోని ప్రధాన మీడియా సంస్థలపై కనె్నర్ర చేశారు. తన ప్రభుత్వం చేపట్టిన అణు విధానాన్ని విమర్శిస్తూ కథనాలు ప్రసారం చేసిన మీడియా నెట్‌వర్క్‌లపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ట్రంప్ లైసెన్సులు రద్దుచేస్తామని హెచ్చరించారు. తప్పుడు వార్తలు ప్రసారం చేస్తే ఉపేక్షించేది లేదు, ఎలాంటి ఆధారాలు లేకుండా వార్తా కథనాలు ఇస్తే చర్యలు తప్పవని ఆయన తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆయన మద్దతుదారులు ఇటీవల మీడియాలో వస్తున్న వార్తలపై విరుచుకుపడుతున్నారు. ఎలాంటి ఆధారాలు లేని కల్పిత కథనాలు జనంలోకి వదలుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. అణ్వాయుధాగారాలు పెంచుతూ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రముఖ మీడియా సంస్థ ఎన్‌బిసి ప్రసారం చేసిన వార్తపై అధ్యక్షుడు తీవ్ర ఆగ్రహం వక్తం చేశారు. ఎన్‌బిసిలో వచ్చిన కథనాలన్ని ‘వండివార్చినవే’ అని ట్రంప్ విమర్శించారు. ‘ఎన్‌బిసి ప్రసారం చేసే వార్తా కథనాలన్నీ అభూతకల్పన, నకిలీలే. ఆ మీడియా సంస్థ లైసెన్సు ఎందుకు రద్దుచేయకూడదు? దేశానికి చెడ్డపేరు తెస్తున్న మీడియా సంస్థలపై చర్యలు ఎందుకు తీసుకోకూడదు?’ అంటూ ట్రంప్ తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించారు. ‘అవి ముమ్మాటికీ బోగస్ వార్తలే. అలాంటి వాటిని ప్రసారం చేస్తున్న మీడియా సంస్థల లైసెన్సులను రద్దు చేయాల్సిందే’ అని ట్రంప్ ట్వీట్ చేశారు. దేశ భద్రత కోసమే అణ్వాయుధాగారాల సంఖ్యను పెంచాలన్న నిర్ణయం తీసుకుంటే పనిగట్టుకుని విమర్శిస్తారా అంటూ అమెరికా అధ్యక్షుడు మండిపడ్డారు.

చిత్రం..అమెరికా పర్యటనకు వచ్చిన కెనడా ప్రధాన మంత్రితో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్