అంతర్జాతీయం

పది దేశాల నదుల నుంచి 95 శాతం ప్లాస్టిక్ చెత్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెర్లిన్, అక్టోబర్ 18: సముద్రాల్లోకి చేరుతున్న ప్లాస్టిక్ చెత్తలో 95 శాతం చెత్త కేవలం పది నదుల నుంచి చేరుతున్నదేనంటే నమ్ముతారా? ఇది నిజం అంటున్నారు దీనిపై అధ్యయనం చేస్తున్న శాస్తవ్రేత్తలు. గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఆ పది నదుల్లో పవిత్ర గంగా పేరు కూడా ఉండటం. ఈ పది నదుల్లో ఎనిమిది నదులు ఆసియా ఖండంలో ప్రవహిస్తున్నవైతే, మిగిలిన రెండు నదులు ఆఫ్రికా ఖండంలో ప్రవహిస్తున్నవి. ఈ రెండు ఖండాల్లో అత్యధిక జనాభా నివసిస్తుండటమే కారణమంటున్నారు శాస్తవ్రేత్తలు. ఏటా మిలియన్ల టన్నుల కొద్దీ ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాలకు చేరుతుండటంతో, పర్యావరణ సమతుల్యత దెబ్బతిని భూవాతావరణంలోనే అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయని శాస్తవ్రేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి మారాలంటే, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడంమే కాదు, వాడుతున్న ప్లాస్టిక్ నదుల ద్వారా సముద్రంలోకి చేరడాన్ని కూడా నియంత్రించాలని అంటున్నారు. ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని అతి పెద్ద నదుల ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాలు పెద్దఎత్తున సముద్రానికి చేరుతున్నట్టు ఎప్పుడో గుర్తించినప్పటికీ, ఇటీవలి కాలంలో ఈ పరిస్థితి మరింత ఉధృతమైందని అధ్యయనవేత్తలు కనుగొన్నారు.
సముద్రాల్లోకి ప్లాస్టిక్ చెత్త పేరుకుపోతుండటం వల్ల సముద్ర జీవరాశి దారుణంగా దెబ్బతింటోందని అధ్యయనాల్లో తేటతెల్లం చేశారు. ఉదాహరణకు ప్లాస్టిక్ వ్యర్థాలను ఆహారంగా భావించి తినేస్తున్న చేపలు, సముద్ర పక్షులు, పెద్ద పెద్ద సముద్ర జంతువులు క్రమంగా అంతరించిపోతున్నాయని, ఈ పరిస్థితులే వాతావరణ సమతుల్యతను దెబ్బతీస్తున్నాయని జర్మనీలోని హెల్మ్‌హోల్జ్ పర్యావరణ పరిశోధనా కేంద్రం శాస్తవ్రేత్త క్రిస్టియన్ స్కిమిడ్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘సముద్ర ఉపరితలంపై పేరుకుపోతున్న ప్లాస్టిక్‌ను శుభ్రపర్చడం అన్నది ప్రస్తుత పరిస్థితుల్లో మానవమాత్రుడికి సాధ్యం కాదు. కాకపోతే, అదనంగా మరింత వ్యర్థాలు పేరుకుపోకుండా జాగ్రత్తలు తీసుకోవడం అన్నది అసాధ్యమేమీ కాదు. ప్రపంచ దేశాలన్నీ దీనిపై దృష్టి పెట్టాల్సి ఉంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.